Ideṟamganaidi nenu yemisedu naayagumda

ఇదెఱఁగనైతి నేను యేమిసేతు నాయకుఁడ
Language

(॥పల్లవి॥)
ఇదెఱఁగనైతి నేను యేమిసేతు నాయకుఁడ
చెదరి నీ మతి కెంత సిగ్గాయనో

(॥ఇదె॥)
నిక్కి చూడఁబోతేను నీచేఁత బాయిటఁబడె
మొక్కఁబోతే కొనగోరిమొన దాఁకెను
చెక్కు నొక్కఁబోతేను చెమట చేతికి వచ్చె
చిక్కి నీకు నపుడెంత సిగ్గాయనో

(॥ఇదె॥)
మాఁటలాడఁబోతేను మర్మాలు దొరలివచ్చె
మూఁటగా నవ్వించితేను మోవిరేఁగెను
కూటమికి దగ్గరితే గురుతువాసన లుబ్బె
చీటికిమాటికి నెంత సిగ్గాయనో

(॥ఇదె॥)
ప్రేమఁ గాఁగిలించుకొంటే బేంట్లైరాలె గందము
ఆమని రతిసేసితే నన్నీ దెలిసె
నేమపు శ్రీ వేంకటేశ నీవు నేనుఁగూడితిమి
చేముంచి మెచ్చితే నెంత సిగ్గాయనో

(||pallavi||)
idĕṟam̐ganaidi nenu yemisedu nāyagum̐ḍa
sĕdari nī madi kĕṁta siggāyano

(||idĕ||)
nikki sūḍam̐bodenu nīsem̐ta bāyiḍam̐baḍĕ
mŏkkam̐bode kŏnagorimŏna dām̐kĕnu
sĕkku nŏkkam̐bodenu sĕmaḍa sedigi vachchĕ
sikki nīgu nabuḍĕṁta siggāyano

(||idĕ||)
mām̐ṭalāḍam̐bodenu marmālu dŏralivachchĕ
mūm̐ṭagā navviṁchidenu movirem̐gĕnu
kūḍamigi daggaride guruduvāsana lubbĕ
sīḍigimāḍigi nĕṁta siggāyano

(||idĕ||)
premam̐ gām̐giliṁchugŏṁṭe beṁṭlairālĕ gaṁdamu
āmani radiseside nannī dĕlisĕ
nemabu śhrī veṁkaḍeśha nīvu nenum̐gūḍidimi
semuṁchi mĕchchide nĕṁta siggāyano