ఇదె వచ్చె రమణుఁడు యెంచిన యెన్నికలాయ
(॥పల్లవి॥)
ఇదె వచ్చె రమణుఁడు యెంచిన యెన్నికలాయ
మదనమంత్రాలతోడ మాటాడవే
(॥॥)
చెక్కిటఁబెట్టినచేయి చిత్తములోనికి నూయి
తక్కినసిగ్గులకెల్లా దండదాయి
చక్కనినీవదనము చందురునిసదనము
మక్కువతోఁ జిన్నఁబోక మాటాడవే
(॥॥)
ఆరీతి పయ్యదకొంగు యౌవ్వనపాయపురంగు
పోరచి కోరికలెల్లాఁ బొంగేటిపొంగు
సారపు నీకెమోవి చల్లగప్రపుదీవి వే
మారు దడువక ఇట్టె మాటాడవే
(॥॥)
సగమువీడినకొప్పు సరసమాడేవొప్పు
పగటుభావరతులు పట్టిచ్చేచొప్పు
తగు శ్రీ వేంకటపతి దగ్గరి నిన్నిటు గూడె
మగఁటిమెల్లా మెరసి మాఁటాడవే
(||pallavi||)
idĕ vachchĕ ramaṇum̐ḍu yĕṁchina yĕnnigalāya
madanamaṁtrāladoḍa māḍāḍave
(||||)
sĕkkiḍam̐bĕṭṭinaseyi sittamulonigi nūyi
takkinasiggulagĕllā daṁḍadāyi
sakkaninīvadanamu saṁdurunisadanamu
makkuvadom̐ jinnam̐boga māḍāḍave
(||||)
ārīdi payyadagŏṁgu yauvvanabāyaburaṁgu
porasi korigalĕllām̐ bŏṁgeḍibŏṁgu
sārabu nīgĕmovi sallagaprabudīvi ve
māru daḍuvaga iṭṭĕ māḍāḍave
(||||)
sagamuvīḍinagŏppu sarasamāḍevŏppu
pagaḍubhāvaradulu paṭṭichchesŏppu
tagu śhrī veṁkaḍabadi daggari ninniḍu gūḍĕ
magam̐ṭimĕllā mĕrasi mām̐ṭāḍave