Ide pemdlilagna vela yimtigi neegu

ఇదె పెండ్లిలగ్న వేళ యింతికి నీకు
Language

(॥పల్లవి॥)
ఇదె పెండ్లిలగ్న వేళ యింతికి నీకు
సుదతి మోవిచిగుళ్ళు సోబనపత్రికలు

(॥ఇందె॥)
తొయ్యలి చూచినచూపు తుమ్మిదుపేరటాండ్లు
నెయ్యమున నవె నీకు నివాళ్ళు
పయ్యదలో చన్నులు పరగ బూజగుండలు
నియ్యడఁ గంత కవె నిమ్మపండ్లు

(॥ఇందె॥)
చెలియ నవ్విననవ్వు జిగి నీకుఁ దలఁబాలు
చెలఁగి బువ్వాన కవె చిలుపాలు
పలుకుల సరసాలు బలుమంగళాష్టకాలు
మలసి యవె మదనమంత్రాలు

(॥ఇందె॥)
వనిత కాఁగిలి నీకు వాటపుఁ బెండ్లిచవిక
దినము నదె దోమతెరమంచము
వినయపు రతులు శ్రీవేంకటేశ యిద్దరికి
కనుఁగొన నవె మీకు కంకణదారాలు

(||pallavi||)
idĕ pĕṁḍlilagna veḽa yiṁtigi nīgu
sudadi movisiguḽḽu sobanabatrigalu

(||iṁdĕ||)
tŏyyali sūsinasūbu tummiduberaḍāṁḍlu
nĕyyamuna navĕ nīgu nivāḽḽu
payyadalo sannulu paraga būjaguṁḍalu
niyyaḍam̐ gaṁta kavĕ nimmabaṁḍlu

(||iṁdĕ||)
sĕliya navvinanavvu jigi nīgum̐ dalam̐bālu
sĕlam̐gi buvvāna kavĕ silubālu
palugula sarasālu balumaṁgaḽāṣhṭagālu
malasi yavĕ madanamaṁtrālu

(||iṁdĕ||)
vanida kām̐gili nīgu vāḍabum̐ bĕṁḍlisaviga
dinamu nadĕ domadĕramaṁchamu
vinayabu radulu śhrīveṁkaḍeśha yiddarigi
kanum̐gŏna navĕ mīgu kaṁkaṇadārālu