Ide nem jesina bhaagya memiseppedi

ఇదె నేఁ జేసిన భాగ్య మేమిచెప్పేది
Language

(॥పల్లవి॥)
ఇదె నేఁ జేసిన భాగ్య మేమిచెప్పేది
పొదిగొని వలపులె పోదిసేసేవు

(॥ఇదె॥)
వంతులవాసులవారు వద్దఁ గాచుకుండఁగాను
చెంతల నాపై నేల చేయివేసేవు
సంతలో బేరములే సరసమే కురియఁగా
పొంతనుండి నాతోడీ పొందుసేసేవు

(॥ఇదె॥)
కోటానఁగోటి సతులు కొలువులో నుండఁగాను
సూటిగాను నా మొగమే చూచేవు
తేటచెలమలవలె తేనెలమాట లాడఁగా
కూటమి కొడఁబఱచి కొంగువట్టేవు

(॥ఇదె॥)
సేసలు వెట్టినవారు సేనాసేన లుండఁగాను
ఆసపడి నన్నుఁగూడి ఆనదించేవు
బాసల శ్రీవేంకటేశ పాలవలె నవ్వఁగాను
రాసికెక్క నన్నే గారవించి మెచ్చేవు

(||pallavi||)
idĕ nem̐ jesina bhāgya memisĕppedi
pŏdigŏni valabulĕ podisesevu

(||idĕ||)
vaṁtulavāsulavāru vaddam̐ gāsuguṁḍam̐gānu
sĕṁtala nābai nela seyivesevu
saṁtalo beramule sarasame kuriyam̐gā
pŏṁtanuṁḍi nādoḍī pŏṁdusesevu

(||idĕ||)
koḍānam̐goḍi sadulu kŏluvulo nuṁḍam̐gānu
sūḍigānu nā mŏgame sūsevu
teḍasĕlamalavalĕ tenĕlamāḍa lāḍam̐gā
kūḍami kŏḍam̐baṟasi kŏṁguvaṭṭevu

(||idĕ||)
sesalu vĕṭṭinavāru senāsena luṁḍam̐gānu
āsabaḍi nannum̐gūḍi ānadiṁchevu
bāsala śhrīveṁkaḍeśha pālavalĕ navvam̐gānu
rāsigĕkka nanne gāraviṁchi mĕchchevu