Ide neegu laabhamu yemchi soosugomtenu

ఇదె నీకు లాభము యెంచి చూచుకొంటేను
Language

(॥పల్లవి॥)
ఇదె నీకు లాభము యెంచి చూచుకొంటేను
పదాలు వాడే నేను; భ్రమయించ కిఁకను

(॥ఇదె॥)
పంత మెంత లేదు నీతో పలుమారు నాడుకొంటే
అంత నిన్ను మీర దోసమని కాక
కాఁతల నాతోఁ జెప్పకు కాఁకలు వుట్టించకు
సంతోసాన నున్న దాన సమ్మతించి నేను

(॥ఇదె॥)
నేరుపెంత లేదు నీపై నిందలెల్లా మోపితేను
ఆరీతిఁ జేయ దోసమని కాక
వారి వీరిఁ జూపకు వాసులు వుట్టించకు
కోరికతో నున్నదాన గుట్టుసేసి నేను

(॥ఇదె॥)
చలమెంత లేదు నీతో సారె సారెఁ జూపితేను
అలఇంచఁ గదుదోసమని కాక
యెలమి శ్రీవేంకటేశ యెరవు సేయకు నన్ను
కలసి నే నున్నదాన కాలమెల్లా నేను

(||pallavi||)
idĕ nīgu lābhamu yĕṁchi sūsugŏṁṭenu
padālu vāḍe nenu; bhramayiṁcha kim̐kanu

(||idĕ||)
paṁta mĕṁta ledu nīdo palumāru nāḍugŏṁṭe
aṁta ninnu mīra dosamani kāga
kām̐tala nādom̐ jĕppagu kām̐kalu vuṭṭiṁchagu
saṁtosāna nunna dāna sammadiṁchi nenu

(||idĕ||)
nerubĕṁta ledu nībai niṁdalĕllā mobidenu
ārīdim̐ jeya dosamani kāga
vāri vīrim̐ jūbagu vāsulu vuṭṭiṁchagu
korigado nunnadāna guṭṭusesi nenu

(||idĕ||)
salamĕṁta ledu nīdo sārĕ sārĕm̐ jūbidenu
ala̮iṁcham̐ gadudosamani kāga
yĕlami śhrīveṁkaḍeśha yĕravu seyagu nannu
kalasi ne nunnadāna kālamĕllā nenu