ఇదె నీ చిత్తం బింక నాభాగ్యము యిన్ని విన్నపము లిందునే వున్నది
(॥పల్లవి॥)
ఇదె నీ చిత్తం బింక నాభాగ్యము యిన్ని విన్నపము లిందునే వున్నది
హృదయములోపల నీ వున్నాఁడవు యెఱుఁగని యర్థం బించుక లేదు
(॥ఇదె॥)
మొగినా యుష్యము నూరేండ్లు ఇంక ముందరఁ జేసెదఁ బుణ్యము లనుచును
తగనా యిచ్చల వలసినట్లనేఁ దప్పె ననక భోగించితిని
జిగి నొకదేవత ననుచరించను సేసిన ధర్మం బొకటీఁ గానను
నిగిడి వృద్ధు నైతి నింతలోనను నీ ముందర నే నిలిచితిని
(॥ఇదె॥)
అనేక కాలము బ్రహ్మకల్పము నడల యందు నే జన్మించి ముక్తివడతు నని
పొనుఁగుచు నిహమే కోరుచు నాసల పుట్టుగులకు నొడి గట్టితిని
అనిశము మునులను అవలింబించను ఆధారమొక్కటి సంపాదించను
తనిసి యిదివో దుర్బలుఁడ నైతినీ దయాదృష్టినే తగిలితిని
(॥ఇదె॥)
శ్రీవేంకటగిరి పరమపావనము చేరి యందు నీ సేవ సేతు నని
త్రోవ చూచుకొని యిన్నాళ్ల(?) దనేక దొరకొని వేడ్కల మెలఁగితిని
భావములోనొక యుక్తియు వెదకనుపరులు నాకు రక్షకులని తలఁచను
చేవమీఱి నిర్భరుఁడ నైతిని శ్రీసంకల్పాశ్రితుఁడ నైతిని
(||pallavi||)
idĕ nī sittaṁ biṁka nābhāgyamu yinni vinnabamu liṁdune vunnadi
hṛdayamulobala nī vunnām̐ḍavu yĕṟum̐gani yardhaṁ biṁchuga ledu
(||idĕ||)
mŏginā yuṣhyamu nūreṁḍlu iṁka muṁdaram̐ jesĕdam̐ buṇyamu lanusunu
taganā yichchala valasinaṭlanem̐ dappĕ nanaga bhogiṁchidini
jigi nŏgadevada nanusariṁchanu sesina dharmaṁ bŏgaḍīm̐ gānanu
nigiḍi vṛddhu naidi niṁtalonanu nī muṁdara ne nilisidini
(||idĕ||)
anega kālamu brahmagalbamu naḍala yaṁdu ne janmiṁchi muktivaḍadu nani
pŏnum̐gusu nihame korusu nāsala puṭṭugulagu nŏḍi gaṭṭidini
aniśhamu munulanu avaliṁbiṁchanu ādhāramŏkkaḍi saṁpādiṁchanu
tanisi yidivo durbalum̐ḍa naidinī dayādṛṣhṭine tagilidini
(||idĕ||)
śhrīveṁkaḍagiri paramabāvanamu seri yaṁdu nī seva sedu nani
trova sūsugŏni yinnāḽla(?) danega dŏragŏni veḍkala mĕlam̐gidini
bhāvamulonŏga yuktiyu vĕdaganubarulu nāgu rakṣhagulani talam̐sanu
sevamīṟi nirbharum̐ḍa naidini śhrīsaṁkalbāśhridum̐ḍa naidini