Iddarunu nogade yeppudunu

ఇద్దరును నొకటే యెప్పుడును
Language

(॥పల్లవి॥)
ఇద్దరును నొకటే యెప్పుడును
బుద్దులు చెప్పఁగఁ బొలఁతుల వశమా

(॥ఇద్ద॥)
చక్కనిపతితో జరయుచు నాడేవు
యెక్కడిమాట లివేమిటికి
లక్కవంటివె లలనలమనసులు
గక్కునఁ గరఁగును కరకరి యేలే

(॥ఇద్ద॥)
కందువ నాతనిఁ గడుజంకించేవు
యెందాఁకాఁ జల మేమిటికే
పొందగువయసులు పొద్దగు వింతలు
బిందెల దగులౌ పెనఁగఁగనేలే

(॥ఇద్ద॥)
శ్రీవేంకటేశ్వరుఁ జెనకుచుఁ గూడేవు
యీవలఁ బంతము యేమిటికే
వేవేలు సిగ్గులు వెన్నెలవంటివి
చేవలుదేరును చిడుముడి యేలే

(||pallavi||)
iddarunu nŏgaḍe yĕppuḍunu
buddulu sĕppam̐gam̐ bŏlam̐tula vaśhamā

(||idda||)
sakkanibadido jarayusu nāḍevu
yĕkkaḍimāḍa livemiḍigi
lakkavaṁṭivĕ lalanalamanasulu
gakkunam̐ garam̐gunu karagari yele

(||idda||)
kaṁduva nādanim̐ gaḍujaṁkiṁchevu
yĕṁdām̐kām̐ jala memiḍige
pŏṁdaguvayasulu pŏddagu viṁtalu
biṁdĕla dagulau pĕnam̐gam̐ganele

(||idda||)
śhrīveṁkaḍeśhvarum̐ jĕnagusum̐ gūḍevu
yīvalam̐ baṁtamu yemiḍige
vevelu siggulu vĕnnĕlavaṁṭivi
sevaluderunu siḍumuḍi yele