ఇద్దరుఁ గూడుండితే నేకచిత్తమౌఁగాక
(॥పల్లవి॥)
ఇద్దరుఁ గూడుండితే నేకచిత్తమౌఁగాక
గద్దరితనా లింతేసి కడుఁ దగదయ్యా
(॥ఇద్ద॥)
ఇంటిలోన ఆపెను నీ వేమంటివో కాని
గొంటుఁదనమున నట్టె కూచున్నది
వెంటఁబెట్టుకొనిరాక వెళ్ళివచ్చితివి నీవే
వొంటి నాపె వేగించనోపునటవయ్యా
(॥ఇద్ద॥)
పానుపుపై నాపె నెంతపచ్చి సేసితివో కాని
పూనినట్టి సిగ్గుతోడ నూరకున్నది
మౌనాన నట్టె వుండక మారుమంచ మెక్కితివి
పూనినవలపులకుఁ బోయఁజోటేదయ్యా
(॥ఇద్ద॥)
కాఁగిటిలో నాపె నెంత కరఁగించితివో కాని
మాఁగినమోవితోడ మలశున్నది
వీఁగక శ్రీవేంకటేశ వెలఁదికొంగు వట్టితి
చేఁగదేర నిట్లానే చిత్తగించవయ్యా
(||pallavi||)
iddarum̐ gūḍuṁḍide negasittamaum̐gāga
gaddaridanā liṁtesi kaḍum̐ dagadayyā
(||idda||)
iṁṭilona ābĕnu nī vemaṁṭivo kāni
gŏṁṭum̐danamuna naṭṭĕ kūsunnadi
vĕṁṭam̐bĕṭṭugŏnirāga vĕḽḽivachchidivi nīve
vŏṁṭi nābĕ vegiṁchanobunaḍavayyā
(||idda||)
pānububai nābĕ nĕṁtabachchi sesidivo kāni
pūninaṭṭi siggudoḍa nūragunnadi
maunāna naṭṭĕ vuṁḍaga mārumaṁcha mĕkkidivi
pūninavalabulagum̐ boyam̐joḍedayyā
(||idda||)
kām̐giḍilo nābĕ nĕṁta karam̐giṁchidivo kāni
mām̐ginamovidoḍa malaśhunnadi
vīm̐gaga śhrīveṁkaḍeśha vĕlam̐digŏṁgu vaṭṭidi
sem̐gadera niṭlāne sittagiṁchavayyā