Iddarum goodidi reesu limkanela

ఇద్దరుఁ గూడితి రీసు లిఁకనేల
Language

(॥పల్లవి॥)
ఇద్దరుఁ గూడితి రీసు లిఁకనేల
వొద్దికాయ నాతనితో నొక్కటి గాఁగదవే

(॥ఇద్ద॥)
చనవు వెగ్గళమైతే జడియనేల
మనసు లేకములైతే మరుగనేల
వొనరినపొందులైతే నొరయనేల
వినయానఁ బతిచేతివిడె మందుకొనవే

(॥ఇద్ద॥)
యితవులైవుండితేను యెరవులేల
రతు లొనగూడితేను రవ్వలేల
ప్రతినలు చెల్లితేను పంతములేల
మతకము లెల్లా మాని మాటలాడఁగదవే

(॥ఇద్ద॥)
వేడుకలు వుట్టితేను వేసటలేల
జోడై వుండినచోట సోదించనేల
యీడనే శ్రీవేంకటేశుఁ డేలె నిన్ను
జాడతో నాతనిమోవి చవిగొనఁగదవే

(||pallavi||)
iddarum̐ gūḍidi rīsu lim̐kanela
vŏddigāya nādanido nŏkkaḍi gām̐gadave

(||idda||)
sanavu vĕggaḽamaide jaḍiyanela
manasu legamulaide maruganela
vŏnarinabŏṁdulaide nŏrayanela
vinayānam̐ badisediviḍĕ maṁdugŏnave

(||idda||)
yidavulaivuṁḍidenu yĕravulela
radu lŏnagūḍidenu ravvalela
pradinalu sĕllidenu paṁtamulela
madagamu lĕllā māni māḍalāḍam̐gadave

(||idda||)
veḍugalu vuṭṭidenu vesaḍalela
joḍai vuṁḍinasoḍa sodiṁchanela
yīḍane śhrīveṁkaḍeśhum̐ ḍelĕ ninnu
jāḍado nādanimovi savigŏnam̐gadave