ఇద్దరు నున్నారు యెదురెదురనె మీరు
(॥పల్లవి॥)
ఇద్దరు నున్నారు యెదురెదురనె మీరు
బద్దులు మీతో నాడఁ బనిలేదు మాకు
(॥ఇద్దరు॥)
సెలవి నవ్విననవ్వు సిగ్గులకు మొద లాయ
పలకు దందుకె నీతోఁ బలుమారును
నెలఁత నెచ్చరించేది నీ చెతిదె యిఁక
బలిమి నేయఁగ మాకుఁ బని లేదు యిఁకను
(॥ఇద్దరు॥)
చెక్కునఁ బెట్టినచేయి చేఁతలకు మూల మాయ
చక్కఁగా నందుకె నిన్ను సారెఁ జూడదు
నిక్కి యాపె బుజ్జగించ నీ చేతదిదె యిఁక
చిక్కించుక నేము బుద్ది చెప్పఁ బని లేదు
(॥ఇద్దరు॥)
ముంచినవూరుపు లెల్ల మోహానకె తగు లాయ
పంచల నందుకె నిన్నుఁ బాయ నోపదు
కొంచక శ్రీవెంకటేశ కూట మిది నీచేతిదె
మించి యప్పటి నేల మెచ్చేరు చెలులు
(||pallavi||)
iddaru nunnāru yĕdurĕduranĕ mīru
baddulu mīdo nāḍam̐ baniledu māgu
(||iddaru||)
sĕlavi navvinanavvu siggulagu mŏda lāya
palagu daṁdugĕ nīdom̐ balumārunu
nĕlam̐ta nĕchchariṁchedi nī sĕdidĕ yim̐ka
balimi neyam̐ga māgum̐ bani ledu yim̐kanu
(||iddaru||)
sĕkkunam̐ bĕṭṭinaseyi sem̐talagu mūla māya
sakkam̐gā naṁdugĕ ninnu sārĕm̐ jūḍadu
nikki yābĕ bujjagiṁcha nī sedadidĕ yim̐ka
sikkiṁchuga nemu buddi sĕppam̐ bani ledu
(||iddaru||)
muṁchinavūrubu lĕlla mohānagĕ tagu lāya
paṁchala naṁdugĕ ninnum̐ bāya nobadu
kŏṁchaga śhrīvĕṁkaḍeśha kūḍa midi nīsedidĕ
miṁchi yappaḍi nela mĕchcheru sĕlulu