Iddaru nokkade yeppudunu

ఇద్దరు నొక్కటే యెప్పుడును
Language

(॥పల్లవి॥)
ఇద్దరు నొక్కటే యెప్పుడును
బుద్దులు చెప్పరే పొలఁతుకలూ

(॥॥)
చలమున నూరకే సాదించీఁ జెలి
తలఁపు దెలియకే తన పతిని
కలి ముదిసి మేడిదె గాక తొలుతనె
కలఁక దేరుచరే కామినులు

(॥॥)
విచ్చన విడిగా వెంగెము లాడి
గచ్చుల యలుకల కాంతునిని
హెచ్చి గోరి రేక యేరుగా నెపుడే
మచ్చిక సేయరే మానినులు

(॥॥)
పనివడి కూడుచుఁ బంతము లాడి
ఘనుఁడగు శ్రీ వేంకట విభుని
ననలే విరులై నాఁటక మునుపనె
పెనఁగి మొక్కించరే ప్రియ సఖులు

(||pallavi||)
iddaru nŏkkaḍe yĕppuḍunu
buddulu sĕppare pŏlam̐tugalū

(||||)
salamuna nūrage sādiṁchīm̐ jĕli
talam̐pu dĕliyage tana padini
kali mudisi meḍidĕ gāga tŏludanĕ
kalam̐ka derusare kāminulu

(||||)
vichchana viḍigā vĕṁgĕmu lāḍi
gachchula yalugala kāṁtunini
hĕchchi gori rega yerugā nĕbuḍe
machchiga seyare māninulu

(||||)
panivaḍi kūḍusum̐ baṁtamu lāḍi
ghanum̐ḍagu śhrī veṁkaḍa vibhuni
nanale virulai nām̐ṭaga munubanĕ
pĕnam̐gi mŏkkiṁchare priya sakhulu