Iddaru niddare yimka nemi sedame

ఇద్దరు నిద్దరె యిఁక నేమి సేతమే
Language

(॥పల్లవి॥)
ఇద్దరు నిద్దరె యిఁక నేమి సేతమే
అద్దుకొని మన మిచ్చలాడకుండ వచ్చునా

(॥ఇద్ద॥)
పంతపువిభునితోడ పకపకనవ్వు నవ్వె
యెంతకోపము రేఁచెనే యీలేమ
అంతలో నాయకి తను నంటకు మని యంటేను
యింతేసివొట్టు వెట్టె నీవిభుఁడు

(॥ఇద్ద॥)
అందుండి వచ్చినపతి నలపు చేరిచెనంటా
చెంది యెంత వుడికించీ చెలి నేఁడు
సందడిఁ దప్పుక ఆపె సారెఁ దనుఁ జూచె నని
యెందరి సాకిరివెట్టె నీవిభుఁడు

(॥ఇద్ద॥)
వాడుదేర రమణుని వట్టిమెచ్చు లెల్లా మెచ్చి
యేడసందేహలు రేఁచె నీసతి దాను
ఆడనే శ్రీవేంకటేశ నాపె యట్టె కూడితేను
యీడనే నమ్మిక లిచ్చీ నీవిభుఁడు

(||pallavi||)
iddaru niddarĕ yim̐ka nemi sedame
addugŏni mana michchalāḍaguṁḍa vachchunā

(||idda||)
paṁtabuvibhunidoḍa pagabaganavvu navvĕ
yĕṁtagobamu rem̐sĕne yīlema
aṁtalo nāyagi tanu naṁṭagu mani yaṁṭenu
yiṁtesivŏṭṭu vĕṭṭĕ nīvibhum̐ḍu

(||idda||)
aṁduṁḍi vachchinabadi nalabu serisĕnaṁṭā
sĕṁdi yĕṁta vuḍigiṁchī sĕli nem̐ḍu
saṁdaḍim̐ dappuga ābĕ sārĕm̐ danum̐ jūsĕ nani
yĕṁdari sāgirivĕṭṭĕ nīvibhum̐ḍu

(||idda||)
vāḍudera ramaṇuni vaṭṭimĕchchu lĕllā mĕchchi
yeḍasaṁdehalu rem̐sĕ nīsadi dānu
āḍane śhrīveṁkaḍeśha nābĕ yaṭṭĕ kūḍidenu
yīḍane nammiga lichchī nīvibhum̐ḍu