Iddaru niddare mimmu nemanede

ఇద్దరు నిద్దరే మిమ్ము నేమనేదే
Language

(॥పల్లవి॥)
ఇద్దరు నిద్దరే మిమ్ము నేమనేదే
నిద్దపు నా బుద్ది విననిది మీకుఁ దగదే

(॥ఇద్ద॥)
ముందుముందే వొట్లు మోవిమీఁది తిట్లు
నిందలునాడే దాతని నీకుఁ దగదే
కందువై నబీరాలు కాఁకవుట్టేనేరాలు
అందమై నీమీఁదఁ జేసే దాతనికిఁ దగదే

(॥ఇద్ద॥)
చలివేఁడి గొణఁగులు సారె సారె సణఁగులు
నిలిచి మారుమొగము నీకుఁ దగదే
వలవనితమకాలు వాడు మోముసముకాలు
అలిగితే మారలుగ నతనికిఁ దగదే

(॥ఇద్ద॥)
కాఁగిటిలో వాసులు కదిసినరేసులు
నీఁగనిచలము వీడ నీకుఁ దగదే
వీఁగక నిన్ను శ్రీవేంకటేశుఁ డిటు గూడె
ఆఁగి చలములుచూప నాతనికిఁ దగదే

(||pallavi||)
iddaru niddare mimmu nemanede
niddabu nā buddi vinanidi mīgum̐ dagade

(||idda||)
muṁdumuṁde vŏṭlu movimīm̐di tiṭlu
niṁdalunāḍe dādani nīgum̐ dagade
kaṁduvai nabīrālu kām̐kavuṭṭenerālu
aṁdamai nīmīm̐dam̐ jese dādanigim̐ dagade

(||idda||)
salivem̐ḍi gŏṇam̐gulu sārĕ sārĕ saṇam̐gulu
nilisi mārumŏgamu nīgum̐ dagade
valavanidamagālu vāḍu momusamugālu
aligide māraluga nadanigim̐ dagade

(||idda||)
kām̐giḍilo vāsulu kadisinaresulu
nīm̐ganisalamu vīḍa nīgum̐ dagade
vīm̐gaga ninnu śhrīveṁkaḍeśhum̐ ḍiḍu gūḍĕ
ām̐gi salamulusūba nādanigim̐ dagade