ఇద్దరు నిద్దరే మీరు యిన్నిటాను జాణలు
(॥పల్లవి॥)
ఇద్దరు నిద్దరే మీరు యిన్నిటాను జాణలు
పొద్దువొద్దునకు నిట్టె పొందుసేయవయ్యా
(॥॥)
వాడికెకు మాటలాడి వన్నెలకుఁ బొడచూపి
వేడుకలు సేసీని వెలఁది నీకు
యేడనుండో వచ్చి నీవు యెమ్మెలకు నలసేవు
నీడనుండి వగరించ నేరుచుకోవయ్యా
(॥॥)
సటలకు నవ్వు నవ్వి చవులకు మోవి చూపి
గుటుకల నోరూరించీఁ గోమలి నీకు
మటమాయలకు నీవు మరి వలపు చల్లేవు
తటుకున చెమటలతడి చూపవయ్యా
(॥॥)
వురముపై నెలకొని వుదుటునఁ గాఁగిలించి
మరిగెఁ గూడి యలమేలుమంగ నీకు
యెరవు లేక మన్నించి యిద్దరు మమ్మేలితిరి
యిరవై శ్రీ వేంకటేశ యిట్టె మెచ్చవయ్యా
(||pallavi||)
iddaru niddare mīru yinniḍānu jāṇalu
pŏdduvŏddunagu niṭṭĕ pŏṁduseyavayyā
(||||)
vāḍigĕgu māḍalāḍi vannĕlagum̐ bŏḍasūbi
veḍugalu sesīni vĕlam̐di nīgu
yeḍanuṁḍo vachchi nīvu yĕmmĕlagu nalasevu
nīḍanuṁḍi vagariṁcha nerusugovayyā
(||||)
saḍalagu navvu navvi savulagu movi sūbi
guḍugala norūriṁchīm̐ gomali nīgu
maḍamāyalagu nīvu mari valabu sallevu
taḍuguna sĕmaḍaladaḍi sūbavayyā
(||||)
vuramubai nĕlagŏni vuduḍunam̐ gām̐giliṁchi
marigĕm̐ gūḍi yalamelumaṁga nīgu
yĕravu lega manniṁchi yiddaru mammelidiri
yiravai śhrī veṁkaḍeśha yiṭṭĕ mĕchchavayyā