ఇద్దరు నిద్దరే మరి యెరవులేల
(॥పల్లవి॥)
ఇద్దరు నిద్దరే మరి యెరవులేల
వొద్దికలై లోలోన వొనరుటగాక
(॥ఇద్ద॥)
చెలిమి సేసినమీఁద సిగ్గులువడఁదగునా
కలసి కూడేటితమకములేకాక
వలపు గలిగి తలవంచుకోఁదగునా
సొలసి యట్టె యెదురు చూచుటలే కాక
(॥ఇద్ద॥)
సరసమాడినమీఁద జగడము దగునా
తరితీపులకు లోనై దక్కుటగాక
గొరబై వొలవుకొని కొంకు మరి తగునా
తెరదీసీ వొద్దికలై దీకొనుటేకాక
(॥ఇద్ద॥)
కాఁగిలించుకొన్న మీఁదఁ గపటము దగునా
అంగినమోవులవిందు లందుటగాక
వీఁగక శ్రీవేంకటాద్రివిభుఁడిదె నిన్నుఁగూడె
తోఁగుఁజెమటలతోడ తొలఁకుటగాక
(||pallavi||)
iddaru niddare mari yĕravulela
vŏddigalai lolona vŏnaruḍagāga
(||idda||)
sĕlimi sesinamīm̐da sigguluvaḍam̐dagunā
kalasi kūḍeḍidamagamulegāga
valabu galigi talavaṁchugom̐dagunā
sŏlasi yaṭṭĕ yĕduru sūsuḍale kāga
(||idda||)
sarasamāḍinamīm̐da jagaḍamu dagunā
taridībulagu lonai dakkuḍagāga
gŏrabai vŏlavugŏni kŏṁku mari tagunā
tĕradīsī vŏddigalai dīgŏnuḍegāga
(||idda||)
kām̐giliṁchugŏnna mīm̐dam̐ gabaḍamu dagunā
aṁginamovulaviṁdu laṁduḍagāga
vīm̐gaga śhrīveṁkaḍādrivibhum̐ḍidĕ ninnum̐gūḍĕ
tom̐gum̐jĕmaḍaladoḍa tŏlam̐kuḍagāga