ఇద్దరు నేకములైన యెదురు మీకిఁక లేదు
(॥పల్లవి॥)
ఇద్దరు నేకములైన యెదురు మీకిఁక లేదు
చద్దివేఁడి వలపులకు సటలు మరిలేవు
(॥॥)
తనువు లేకములైన తప్పులునొప్పులు లేవు
మనసు లేకములైన మరఁగులే లేవు
చనవు లేకములైన సాదింపు మరి లేదు
వనిత విచ్చేయఁగదే వరుసఁ బతికడకు
(॥॥)
పలుకు లేకములైనఁ బైకొసరు మరి లేదు
తెలువు లేకములైన తెగువలే లేవు
చెలిమి సరిదాఁకితే చింతలే మరి లేవు
వెలఁది విచ్చేయఁగదే వెనకకతలేల
(॥॥)
వయసు లేకములైన వంతులువాసులు లేవు
ప్రియము లేకములైన బిగువులే లేవు
దయను శ్రీ వేంకటోత్తముఁడు నినుఁగూడె నిదె
ప్రియురాలి విచ్చేయు పిలిపించుకొనక
(||pallavi||)
iddaru negamulaina yĕduru mīgim̐ka ledu
saddivem̐ḍi valabulagu saḍalu marilevu
(||||)
tanuvu legamulaina tappulunŏppulu levu
manasu legamulaina maram̐gule levu
sanavu legamulaina sādiṁpu mari ledu
vanida vichcheyam̐gade varusam̐ badigaḍagu
(||||)
palugu legamulainam̐ baigŏsaru mari ledu
tĕluvu legamulaina tĕguvale levu
sĕlimi saridām̐kide siṁtale mari levu
vĕlam̐di vichcheyam̐gade vĕnagakadalela
(||||)
vayasu legamulaina vaṁtuluvāsulu levu
priyamu legamulaina biguvule levu
dayanu śhrī veṁkaḍottamum̐ḍu ninum̐gūḍĕ nidĕ
priyurāli vichcheyu pilibiṁchugŏnaga