Iddaru meeru goodidiridi maagum badivelu

ఇద్దరు మీరు గూడితిరిది మాకుఁ బదివేలు
Language

(॥పల్లవి॥)
ఇద్దరు మీరు గూడితిరిది మాకుఁ బదివేలు
చద్ది వేఁడి బాసకు నే సాకిరయ్యే మీకును

(॥ఇద్దరు॥)
కోరిన కోరికలాయ కొమ్మ నీతో మాటలాడె
కూరిమి నెవ్వరితోడి గొడవేఁటికి
చీరకొంగేల పట్టేవు సిగ్గుగాఁగా మాకిఁక
ధీరతతో నుండరయ్య తెర వేసే మీకును

(॥ఇద్దరు॥)
నేసినచేఁతలు చెల్లె చెలి నీకు విడెమిచ్చె
ఆసల నెవ్వరితోఁ జెల్లాటాలేఁటికి
బాసికమేల కట్టేవు పంతమా మాకేమైనా
సేస వెట్టుకోరయ్య నెచ్చెలినయ్యే మీకును

(॥ఇద్దరు॥)
పట్టిన వ్రతము చెల్లె పడతి నిన్నిటు గూడె
జట్టిగా నెవ్వరితోడి సడ్డ యేఁటికి
గట్టిగా శ్రీవేంకటేశ కలసితివిటు నన్ను
యిట్టె వద్దనుండరయ్య చుట్టమ నే మీకును

(||pallavi||)
iddaru mīru gūḍidiridi māgum̐ badivelu
saddi vem̐ḍi bāsagu ne sāgirayye mīgunu

(||iddaru||)
korina korigalāya kŏmma nīdo māḍalāḍĕ
kūrimi nĕvvaridoḍi gŏḍavem̐ṭigi
sīragŏṁgela paṭṭevu siggugām̐gā māgim̐ka
dhīradado nuṁḍarayya tĕra vese mīgunu

(||iddaru||)
nesinasem̐talu sĕllĕ sĕli nīgu viḍĕmichchĕ
āsala nĕvvaridom̐ jĕllāḍālem̐ṭigi
bāsigamela kaṭṭevu paṁtamā māgemainā
sesa vĕṭṭugorayya nĕchchĕlinayye mīgunu

(||iddaru||)
paṭṭina vradamu sĕllĕ paḍadi ninniḍu gūḍĕ
jaṭṭigā nĕvvaridoḍi saḍḍa yem̐ṭigi
gaṭṭigā śhrīveṁkaḍeśha kalasidiviḍu nannu
yiṭṭĕ vaddanuṁḍarayya suṭṭama ne mīgunu