Iddaru jaanale meeru yimdaru mechcheru mimmu

ఇద్దరు జాణలే మీరు యిందరు మెచ్చేరు మిమ్ము
Language

(॥పల్లవి॥)
ఇద్దరు జాణలే మీరు యిందరు మెచ్చేరు మిమ్ము
సుద్దులు దడవుకొంటాఁ జొక్కేరు మీరు

(॥ఇద్దరు॥)
యెదురుగాఁ గూచుండి యేలాటాలాడి నీపై
చదురుల వలపులు చల్లీ నాకె
వెదచల్లు నవ్వులతో వెస గద్దెమీఁద నుండి
సదరానఁ బాదములు చాఁచేవాపెమీఁదను

(॥ఇద్దరు॥)
సరికి బేసికినుండి సాటివెట్టుకొని నిన్ను
విరులఁ బూఁచి పూఁచి వేసీ నాపె
దొరతనమున నీవు తూఁగుమంచమూఁచి వూఁచి
అరిది చన్నులు దాఁక నంటించేవు గోరను

(॥ఇద్దరు॥)
వేదాద్రిమీఁదనుండి విందు వెట్టి లకిమన్ము
ఆదిగొని కూడె నిన్ను నౌభళేశ
పాదుకొని గరుడాదిపై శ్రీవేంకటేశుఁడవై
సేదదేరఁ బెండ్లాడి చెలఁగేవు నీవు

(||pallavi||)
iddaru jāṇale mīru yiṁdaru mĕchcheru mimmu
suddulu daḍavugŏṁṭām̐ jŏkkeru mīru

(||iddaru||)
yĕdurugām̐ gūsuṁḍi yelāḍālāḍi nībai
sadurula valabulu sallī nāgĕ
vĕdasallu navvulado vĕsa gaddĕmīm̐da nuṁḍi
sadarānam̐ bādamulu sām̐sevābĕmīm̐danu

(||iddaru||)
sarigi besiginuṁḍi sāḍivĕṭṭugŏni ninnu
virulam̐ būm̐si pūm̐si vesī nābĕ
dŏradanamuna nīvu tūm̐gumaṁchamūm̐si vūm̐si
aridi sannulu dām̐ka naṁṭiṁchevu goranu

(||iddaru||)
vedādrimīm̐danuṁḍi viṁdu vĕṭṭi lagimanmu
ādigŏni kūḍĕ ninnu naubhaḽeśha
pādugŏni garuḍādibai śhrīveṁkaḍeśhum̐ḍavai
sedaderam̐ bĕṁḍlāḍi sĕlam̐gevu nīvu