Iddaru jaanale meeru yemchi sooside

ఇద్దరు జాణలే మీరు యెంచి చూచితే
Language

(॥పల్లవి॥)
ఇద్దరు జాణలే మీరు యెంచి చూచితే
పొద్దులు గడపుదురా పొరుగునను

(॥॥)
దిగ్గన సరసమున దిట్టులెన్ని దిట్టినాను
యెగ్గులు వట్టుదురా యింతలోననే
వెగ్గళించి చనవున వెస మర్మములంటితే
సిగ్గులు వడుదురా జిగిమించను

(॥॥)
జవ్వనపాయముతోడ సారె సారెఁ జెనకితే
నవ్వులు నవ్వుదురా నట్టినడుమ
నివ్వటిల్లు సన్న లెల్లా నెట్టుకొనఁ జేసితేను
రవ్వలు సేయుదురా రచ్చలోనను

(॥॥)
సమ్మతించి కాఁగిళ్ళను సమరతిఁ బెనఁగితే
బొమ్మల జంకింతురా పూఁచిపట్టుక
యిమ్ముల శ్రీవేంకటేశ యిట్టె మీరు గూడితిరి
దొమ్ములు సేయుదురా తోడఁదోడను

(||pallavi||)
iddaru jāṇale mīru yĕṁchi sūside
pŏddulu gaḍabudurā pŏrugunanu

(||||)
diggana sarasamuna diṭṭulĕnni diṭṭinānu
yĕggulu vaṭṭudurā yiṁtalonane
vĕggaḽiṁchi sanavuna vĕsa marmamulaṁṭide
siggulu vaḍudurā jigimiṁchanu

(||||)
javvanabāyamudoḍa sārĕ sārĕm̐ jĕnagide
navvulu navvudurā naṭṭinaḍuma
nivvaḍillu sanna lĕllā nĕṭṭugŏnam̐ jesidenu
ravvalu seyudurā rachchalonanu

(||||)
sammadiṁchi kām̐giḽḽanu samaradim̐ bĕnam̐gide
bŏmmala jaṁkiṁturā pūm̐sibaṭṭuga
yimmula śhrīveṁkaḍeśha yiṭṭĕ mīru gūḍidiri
dŏmmulu seyudurā toḍam̐doḍanu