ఇద్దరు దేహసంబంధ మిదిగో మాయ
(॥పల్లవి॥)
ఇద్దరు దేహసంబంధ మిదిగో మాయ
గద్దించి యేడ నుండునో కడసారి తాను
(॥ఇద్దరు॥)
తోడఁ బుట్టిన మమత తొడఁగి కొన్నాళ్లకు
వాడిక పుత్రులమీఁదవలె నుండదూ
వేడుక వారెవ్వరొ వీరెవ్వరొ కాని
కూడ పెట్టి వీరికి కొట్లాడి వారికి
(॥ఇద్దరు॥)
తల్లిమీఁదఁ గల భక్తి తనకె కొన్నాళ్లకు
యిల్లాలిమీఁదవలె యింత వుండదు
వెల్లిలిరి నిది గొంత విచారించనిది గొంత
యిల్లు ముంగి లొక్కరిది యెరవు వొక్కరిది
(॥ఇద్దరు॥)
నీతితో శ్రీ వేంకటేశు నిత్యసేవ కొన్నాళ్లకు
యీతల సంసారమెంత యితవు గాదు
ఆతఁ డెట్టు యిదియెట్టు అందరూ నెఱిఁగినదె
చేతులొక్కరియందు చిత్త మొక్కరియందు
(||pallavi||)
iddaru dehasaṁbaṁdha midigo māya
gaddiṁchi yeḍa nuṁḍuno kaḍasāri tānu
(||iddaru||)
toḍam̐ buṭṭina mamada tŏḍam̐gi kŏnnāḽlagu
vāḍiga putrulamīm̐davalĕ nuṁḍadū
veḍuga vārĕvvarŏ vīrĕvvarŏ kāni
kūḍa pĕṭṭi vīrigi kŏṭlāḍi vārigi
(||iddaru||)
tallimīm̐dam̐ gala bhakti tanagĕ kŏnnāḽlagu
yillālimīm̐davalĕ yiṁta vuṁḍadu
vĕlliliri nidi gŏṁta visāriṁchanidi gŏṁta
yillu muṁgi lŏkkaridi yĕravu vŏkkaridi
(||iddaru||)
nīdido śhrī veṁkaḍeśhu nityaseva kŏnnāḽlagu
yīdala saṁsāramĕṁta yidavu gādu
ādam̐ ḍĕṭṭu yidiyĕṭṭu aṁdarū nĕṟim̐ginadĕ
sedulŏkkariyaṁdu sitta mŏkkariyaṁdu