ఇద్దరూ జాణలే మీరు యేమని పొగడవచ్చు
(॥పల్లవి॥)
ఇద్దరూ జాణలే మీరు యేమని పొగడవచ్చు
కద్దు మీ పొందులు వింటిఁ గడపలోపలను
(॥ఇద్ద॥)
నిక్కి చూచి యాపె నిన్ను నిమ్మపంటవేయఁగాను
చొక్కి చొక్కి చేత నొడ్డించుకొనేవు
గక్కన నీ వంతలోను గద్దెపైకిఁ దీసుకొంటె
మెుక్కీఁ జేతుల నీకు మొనగోరు మోపను
(॥ఇద్ద॥)
కూరిమితో నాపె నీకొప్పు వట్టితియ్యఁగాను
చీరకొంగు వట్టుకొని చిమ్మిరేఁచేవు
నేరుపుతోడఁ జన్నులు నీ వప్పటిఁ బిసికితే
కేరుచు నీ మోవిమీఁదఁ గెంపులు నించీని
(॥ఇద్ద॥)
వున్నతి నాపె చన్నుల నుదుటన నిన్నొత్తితే
పన్ని నరతుల గూడి పంతమిచ్చేవు
చెన్నుమీర నీ వందుకు సిగ్గులెల్లాఁ బాపితేను
సన్నల శ్రీవేంకటేశ సతి వేఁడుకొనీని
(||pallavi||)
iddarū jāṇale mīru yemani pŏgaḍavachchu
kaddu mī pŏṁdulu viṁṭim̐ gaḍabalobalanu
(||idda||)
nikki sūsi yābĕ ninnu nimmabaṁṭaveyam̐gānu
sŏkki sŏkki seda nŏḍḍiṁchugŏnevu
gakkana nī vaṁtalonu gaddĕbaigim̐ dīsugŏṁṭĕ
mĕుkkīm̐ jedula nīgu mŏnagoru mobanu
(||idda||)
kūrimido nābĕ nīgŏppu vaṭṭidiyyam̐gānu
sīragŏṁgu vaṭṭugŏni simmirem̐sevu
nerubudoḍam̐ jannulu nī vappaḍim̐ bisigide
kerusu nī movimīm̐dam̐ gĕṁpulu niṁchīni
(||idda||)
vunnadi nābĕ sannula nuduḍana ninnŏttide
panni naradula gūḍi paṁtamichchevu
sĕnnumīra nī vaṁdugu siggulĕllām̐ bābidenu
sannala śhrīveṁkaḍeśha sadi vem̐ḍugŏnīni