Iddarinettu gooruda memi seda mammalaala

ఇద్దరినెట్టు గూరుత మేమి సేత మమ్మలాల
Language

(॥పల్లవి॥)
ఇద్దరినెట్టు గూరుత మేమి సేత మమ్మలాల
వద్దనే సణఁగులాడీ వద్దన్నమానదు

(॥ఇద్ద॥)
మంతనాననాతనితో మాటలాడి చూడరమ్మ
యింతిపై కోపమున నేఁడేమనీనో
చెంతలఁ దా రానందుకు చెలి మొదలనలిగి
వంతలనాతనిఁ దిట్టీ వద్దన్న మానదు

(॥ఇద్ద॥)
నంటుననాతని మీరు నవ్వించి చూడరమ్మ
కంటకమాపెమీఁదఁ గలదో లేదో
యింటికి వచ్చినవానినీపె దానే వాదుదీసి
వొంటినే సన్నలు సేసీనొద్దన్నా మానదు

(॥ఇద్ద॥)
తారుకాణగా దగ్గరి పోఁగదరమ్మ
కూరిమితోనిపుడాకెఁ గూడఁ బోలును
నేరిచి శ్రీవేంకటాద్రి నిలయుని కాఁగిటిలోఁ
నూరకే మొక్కులు మొక్కీనొద్దన్నా మానదు

(||pallavi||)
iddarinĕṭṭu gūruda memi seda mammalāla
vaddane saṇam̐gulāḍī vaddannamānadu

(||idda||)
maṁtanānanādanido māḍalāḍi sūḍaramma
yiṁtibai kobamuna nem̐ḍemanīno
sĕṁtalam̐ dā rānaṁdugu sĕli mŏdalanaligi
vaṁtalanādanim̐ diṭṭī vaddanna mānadu

(||idda||)
naṁṭunanādani mīru navviṁchi sūḍaramma
kaṁṭagamābĕmīm̐dam̐ galado ledo
yiṁṭigi vachchinavāninībĕ dāne vādudīsi
vŏṁṭine sannalu sesīnŏddannā mānadu

(||idda||)
tārugāṇagā daggari pom̐gadaramma
kūrimidonibuḍāgĕm̐ gūḍam̐ bolunu
nerisi śhrīveṁkaḍādri nilayuni kām̐giḍilom̐
nūrage mŏkkulu mŏkkīnŏddannā mānadu