Iddarinaduma numdee idivo taanu

ఇద్దరినడుమ నుండీ ఇదివో తాను
Language

(॥పల్లవి॥)
ఇద్దరినడుమ నుండీ ఇదివో తాను
తిద్దుచు జగడములు తేరిచీఁ గాక

(॥॥)
వొక్కరికి బుద్దిచెప్పీ నొక్కరికి చెక్కు నొక్కి
చక్కనినాయకుఁడు సవతులకు
అక్కరతో నింత సేసినట్టివాఁడు తానే కాఁడా
వుక్కటతో రేఁచుకొని పొడిఁబడిఁగాక

(॥॥)
వొడివట్టీ నాకెను వొడఁబరచి నీకెను
కడుజాణరమణుఁడు కామినులకు
ముడికాఁడైనవాఁడు మొదలఁ దానేకాఁడా
యెడమాటలాడి బయలీఁదుకొనీఁ గాక

(॥॥)
కలసీని జవరాలిఁ గాఁగిలించీ కన్నియను
లలి శ్రీవేంకటేశుఁడు లలనలకు
యెలమి నన్నును నేలె నిన్నిటాఁ దానే కాఁడా
వలపులు పెడరేఁచి వసమయ్యీఁగాక

(||pallavi||)
iddarinaḍuma nuṁḍī idivo tānu
tiddusu jagaḍamulu terisīm̐ gāga

(||||)
vŏkkarigi buddisĕppī nŏkkarigi sĕkku nŏkki
sakkanināyagum̐ḍu savadulagu
akkarado niṁta sesinaṭṭivām̐ḍu tāne kām̐ḍā
vukkaḍado rem̐sugŏni pŏḍim̐baḍim̐gāga

(||||)
vŏḍivaṭṭī nāgĕnu vŏḍam̐barasi nīgĕnu
kaḍujāṇaramaṇum̐ḍu kāminulagu
muḍigām̐ḍainavām̐ḍu mŏdalam̐ dānegām̐ḍā
yĕḍamāḍalāḍi bayalīm̐dugŏnīm̐ gāga

(||||)
kalasīni javarālim̐ gām̐giliṁchī kanniyanu
lali śhrīveṁkaḍeśhum̐ḍu lalanalagu
yĕlami nannunu nelĕ ninniḍām̐ dāne kām̐ḍā
valabulu pĕḍarem̐si vasamayyīm̐gāga