Iddarim goorsamgadave yimtiro neevu

ఇద్దరిఁ గూర్చఁగదవె యింతిరో నీవు
Language

(॥పల్లవి॥)
ఇద్దరిఁ గూర్చఁగదవె యింతిరో నీవు
సుద్దులు చెప్పేనంటే చోటెంతైనాఁ గలదు

(॥॥)
పడఁతి కడకు నిట్టె పతిఁ దోడుకెనిరావె
యెడమాట లాడఁబోతే యెన్నిలేవు
వెడవెడ మాని యట్టె విడెము చేతి కియ్యవే
ఆడరి యాతని ప్రియా లవెన్నై నాఁ గలవు

(॥॥)
మిగులా నిద్దరిఁ బాన్సుమీఁదఁ గూచుండఁ బెట్టవే
తగవుల బెట్టేమంటే తనివిలేదు
బగి వాయకుండా నట్టె పచ్చడము గప్పవే
పగటు లాతనివి చెప్పఁగఁ గొత్త లిపుడు

(॥॥)
శ్రీవేంకటేశ్వరుచేత నేసలు వెట్టించవే
వావులు దెలుపఁగాను వయిపాయను
దేవులకు దేవునికి తెరవేయఁగదవే
చేవదేరేమోహము చెప్పనరు దిఁకను

(||pallavi||)
iddarim̐ gūrsam̐gadavĕ yiṁtiro nīvu
suddulu sĕppenaṁṭe soḍĕṁtainām̐ galadu

(||||)
paḍam̐ti kaḍagu niṭṭĕ padim̐ doḍugĕnirāvĕ
yĕḍamāḍa lāḍam̐bode yĕnnilevu
vĕḍavĕḍa māni yaṭṭĕ viḍĕmu sedi kiyyave
āḍari yādani priyā lavĕnnai nām̐ galavu

(||||)
migulā niddarim̐ bānsumīm̐dam̐ gūsuṁḍam̐ bĕṭṭave
tagavula bĕṭṭemaṁṭe taniviledu
bagi vāyaguṁḍā naṭṭĕ pachchaḍamu gappave
pagaḍu lādanivi sĕppam̐gam̐ gŏtta libuḍu

(||||)
śhrīveṁkaḍeśhvaruseda nesalu vĕṭṭiṁchave
vāvulu dĕlubam̐gānu vayibāyanu
devulagu devunigi tĕraveyam̐gadave
sevaderemohamu sĕppanaru dim̐kanu