Iddarim goorisidimi yemu seligattelamu

ఇద్దరిఁ గూరిచితిమి యేము చెలికత్తెలము
Language

(॥పల్లవి॥)
ఇద్దరిఁ గూరిచితిమి యేము చెలికత్తెలము
పొద్దు కొకకొత్తలుగా భోగించరయ్యా

(॥ఇద్ద॥)
ప్రేమముతో సేసాలపెండ్లికూంతు రిదె వచ్చె
ఆముకొని సరసములాడవయ్యా
ఆమనిసిగ్గులతోడ నదె తెరలో నున్నది
చేముట్టి సేవలెల్లాఁ జేయించుకోవయ్యా

(॥ఇద్ద॥)
మక్కువతో నీమేనమరఁద లిదివో వచ్చె
చక్కఁగాఁ బాదా లీకెపై జాఁచవయ్యా
వెక్కసానఁ దమకించి వేడుకతో నున్నది
గక్కననుఁ దప్పక మొగము చూడవయ్యా

(॥ఇద్ద॥)
అరుదై శ్రీవేంకటేశ అలమేలుమంగ వచ్చె
బెరసి రతుల నిట్టె పెనఁగవయ్యా
గరిమ వేళగాఁచి నీకాఁగిటిలోనే వున్నది
సరికిబేసికి నీవు చనవియ్యవయ్యా

(||pallavi||)
iddarim̐ gūrisidimi yemu sĕligattĕlamu
pŏddu kŏgagŏttalugā bhogiṁcharayyā

(||idda||)
premamudo sesālabĕṁḍligūṁtu ridĕ vachchĕ
āmugŏni sarasamulāḍavayyā
āmanisigguladoḍa nadĕ tĕralo nunnadi
semuṭṭi sevalĕllām̐ jeyiṁchugovayyā

(||idda||)
makkuvado nīmenamaram̐da lidivo vachchĕ
sakkam̐gām̐ bādā līgĕbai jām̐savayyā
vĕkkasānam̐ damagiṁchi veḍugado nunnadi
gakkananum̐ dappaga mŏgamu sūḍavayyā

(||idda||)
arudai śhrīveṁkaḍeśha alamelumaṁga vachchĕ
bĕrasi radula niṭṭĕ pĕnam̐gavayyā
garima veḽagām̐si nīgām̐giḍilone vunnadi
sarigibesigi nīvu sanaviyyavayyā