Iddarilo balimede yimtulaala

ఇద్దరిలో బలిమేదే యింతులాల
Language

(॥పల్లవి॥)
ఇద్దరిలో బలిమేదే యింతులాల
బుద్దిచెప్పరే మాకు పొలఁతులాల

(॥ఇద్ద॥)
నగె నీతఁడు నాతోను మొగము చూచె నీపెను
తగవులు చెప్పరే తరుణులాల
చిగురున వేసె నన్ను శిరసూఁచె దనకును
జిగిఁ దురమొదలేదే చెలువలాలా

(॥ఇద్ద॥)
సారె నాతో మాటలాడె న్నలు సేసెఁ దనకు
తారతమ్మలు చెప్పరే దైతలాల
చేరి నావద్దఁ గూచుండె సిగ్గువడెఁ దనతోను
నేరుపునేరములేవే నెలఁతలాలా

(॥ఇద్ద॥)
సేసవెట్టి నన్నుఁగూడె చెనకెఁ దనచన్నులు
వాసివంతులు చెప్పరే వనితలాల
సేసెఁ బొందు లిద్దరిని శ్రీవేంకటేశుఁ డీతఁడు
ఆసా బాసా నెవ్వరిదే అంగనలాలా

(||pallavi||)
iddarilo balimede yiṁtulāla
buddisĕppare māgu pŏlam̐tulāla

(||idda||)
nagĕ nīdam̐ḍu nādonu mŏgamu sūsĕ nībĕnu
tagavulu sĕppare taruṇulāla
siguruna vesĕ nannu śhirasūm̐sĕ danagunu
jigim̐ duramŏdalede sĕluvalālā

(||idda||)
sārĕ nādo māḍalāḍĕ nnalu sesĕm̐ danagu
tāradammalu sĕppare daidalāla
seri nāvaddam̐ gūsuṁḍĕ sigguvaḍĕm̐ danadonu
nerubuneramuleve nĕlam̐talālā

(||idda||)
sesavĕṭṭi nannum̐gūḍĕ sĕnagĕm̐ danasannulu
vāsivaṁtulu sĕppare vanidalāla
sesĕm̐ bŏṁdu liddarini śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍu
āsā bāsā nĕvvaride aṁganalālā