Iddarigim juttaalamai yikkada numdamu gaaga

ఇద్దరికిఁ జుట్టాలమై యిక్కడ నుందము గాక
Language

(॥పల్లవి॥)
ఇద్దరికిఁ జుట్టాలమై యిక్కడ నుందము గాక
వద్దనుండి తగవులు దిద్దఁ బనియేమే

(॥ఇద్ద॥)
చనవుగలుగుకాంత సరసుని దూరఁగాను
వనివడి యడ్డాలు రాఁ బరులకేమే
విని యందుల కాతఁడు వేడుకతో నవ్వఁగాను
పెనఁగి పంతాలాడఁ బెరవారి కేలే

(॥ఇద్ద॥)
మందెమేళమైనకాంత మగినిఁ జెనకఁగాను
సందు చొచ్చి కాఁతాళించ సవతికేలే
యెందును నాతని కవి యింపులై వుండఁగాను
అందుకొని యౌఁగాదన నండవారి కేలే

(॥ఇద్ద॥)
అలవాటైనకాంత యతనిఁ గాఁగిలించఁగా
మలసి సిగ్గులు వడ మనకేలే
యెలమి శ్రీవేంకటేశుఁ డితఁడే మమ్మునుఁ గూడె
వెలినుండి చొప్పులెత్త వింతవారి కేలే

(||pallavi||)
iddarigim̐ juṭṭālamai yikkaḍa nuṁdamu gāga
vaddanuṁḍi tagavulu diddam̐ baniyeme

(||idda||)
sanavugalugugāṁta sarasuni dūram̐gānu
vanivaḍi yaḍḍālu rām̐ barulageme
vini yaṁdula kādam̐ḍu veḍugado navvam̐gānu
pĕnam̐gi paṁtālāḍam̐ bĕravāri kele

(||idda||)
maṁdĕmeḽamainagāṁta maginim̐ jĕnagam̐gānu
saṁdu sŏchchi kām̐tāḽiṁcha savadigele
yĕṁdunu nādani kavi yiṁpulai vuṁḍam̐gānu
aṁdugŏni yaum̐gādana naṁḍavāri kele

(||idda||)
alavāḍainagāṁta yadanim̐ gām̐giliṁcham̐gā
malasi siggulu vaḍa managele
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍe mammunum̐ gūḍĕ
vĕlinuṁḍi sŏppulĕtta viṁtavāri kele