ఇద్దరికిఁ జెలులము యెడమాట లాడనేల
(॥పల్లవి॥)
ఇద్దరికిఁ జెలులము యెడమాట లాడనేల
వొద్దికలు మీకు మీకే వొనగూడి యున్నవి
(॥ఇద్ద॥)
ఇంతికి నీకు జూపు లెదురుతాఁకులాయ
అంతరంగాలలోనిమీయాస లెట్టీవో
సంతోసపుఁజెమటలు జాలువారీఁ జెక్కుల
చెంతల మీవేడుకలు చెప్పీ నవె ఇపుడు
(॥ఇద్ద॥)
తారుకాణై మీనవ్వులు తాళము వేసినట్టాయ
కోరినకోరిక లెంత గురుతాయనో
సారెసారెఁ బులకలు జాజుకొని మేనుల
యీరీతి మీతమకము లెఱిఁగించి నవియె
(॥ఇద్ద॥)
మోవిమీఁదిమీసన్నలు ముఇకి ముఇయై తోఁచె
తావుల మీఇంపు లెంత తలకూడెనో
శ్రీవేంకటేశ నీకుఁ జేరి యలమేల్‌మంగకు
పోవులాయఁ గళలు మీపొందు చెప్పీనవియె
(||pallavi||)
iddarigim̐ jĕlulamu yĕḍamāḍa lāḍanela
vŏddigalu mīgu mīge vŏnagūḍi yunnavi
(||idda||)
iṁtigi nīgu jūbu lĕdurudām̐kulāya
aṁtaraṁgālalonimīyāsa lĕṭṭīvo
saṁtosabum̐jĕmaḍalu jāluvārīm̐ jĕkkula
sĕṁtala mīveḍugalu sĕppī navĕ ibuḍu
(||idda||)
tārugāṇai mīnavvulu tāḽamu vesinaṭṭāya
korinagoriga lĕṁta gurudāyano
sārĕsārĕm̐ bulagalu jājugŏni menula
yīrīdi mīdamagamu lĕṟim̐giṁchi naviyĕ
(||idda||)
movimīm̐dimīsannalu muigi muiyai tom̐sĕ
tāvula mīiṁpu lĕṁta talagūḍĕno
śhrīveṁkaḍeśha nīgum̐ jeri yalamelmaṁgagu
povulāyam̐ gaḽalu mībŏṁdu sĕppīnaviyĕ