ఇద్దరికిఁ జనవు నీవిచ్చితివి తొలుతనే
(॥పల్లవి॥)
ఇద్దరికిఁ జనవు నీవిచ్చితివి తొలుతనే
వొద్దనుండి బుద్దిచెప్పి వొనగూర్చవయ్యా
(॥॥)
నీయింతితో జగడించి నీవేమందువో యని
చేయెత్తి మొక్కే నిదె సెలవు నీకు
పాయపుదానఁ గాన పంతానకే పెనఁగుదు
మాయిద్దరి సంది దేర్చి మన్నించవయ్యా
(॥॥)
అప్పటి నాపెతో నేను అన్ని యెమ్మెలాడుకొంటి
చెప్పినట్టెల్లాఁ జేసే సెలవు నీకు
తప్పరాని విరహపుదానఁ గాన కొసరితి
ఇప్పుడిద్దరి రక్షించి యేలుకొనవయ్యా
(॥॥)
గరిమ బింకములాడి కడు నిన్ను వేఁడుకొంటి
సిరుల శ్రీవేంకటేశ సెలవు నీకు
వరుసదానఁ గనక వనితచేఁ జెప్పించితి
ఇరవై నన్నుఁ గూడితి విద్దరీఁ గావవయ్యా
(||pallavi||)
iddarigim̐ janavu nīvichchidivi tŏludane
vŏddanuṁḍi buddisĕppi vŏnagūrsavayyā
(||||)
nīyiṁtido jagaḍiṁchi nīvemaṁduvo yani
seyĕtti mŏkke nidĕ sĕlavu nīgu
pāyabudānam̐ gāna paṁtānage pĕnam̐gudu
māyiddari saṁdi dersi manniṁchavayyā
(||||)
appaḍi nābĕdo nenu anni yĕmmĕlāḍugŏṁṭi
sĕppinaṭṭĕllām̐ jese sĕlavu nīgu
tapparāni virahabudānam̐ gāna kŏsaridi
ippuḍiddari rakṣhiṁchi yelugŏnavayyā
(||||)
garima biṁkamulāḍi kaḍu ninnu vem̐ḍugŏṁṭi
sirula śhrīveṁkaḍeśha sĕlavu nīgu
varusadānam̐ ganaga vanidasem̐ jĕppiṁchidi
iravai nannum̐ gūḍidi viddarīm̐ gāvavayyā