ఇద్దరికిఁ దెరమఱఁ గిదే కలది
(॥పల్లవి॥)
ఇద్దరికిఁ దెరమఱఁ గిదే కలది
వుద్దండాలకుఁ బెనఁగకుండవయ్య నీవు
(॥ఇద్ద॥)
సతులకుఁజలము జవ్వనపుఁ బొలము
తతి వలపులకు నుత్తమఫలము
పతికిఁ బతిగా నీవు పంతమాడనింతయేల
రతుల గడివోకుండా రావయ్య నీవు
(॥ఇద్ద॥)
చెలులకు మతిపట్టు చిత్తజునిచేపట్టు
బలులై(వై?)నఅసలకుఁ బాయనిమెట్టు
మలసి ఇందుకుఁగాను మారుకొన నీకేల
కొలఁది మిగులనుఁ జేకొనవయ్య ప్రియము
(॥ఇద్ద॥)
వనితలకు మంకులు వాసుల కెల్లా నంకెలు
వెనకముందరికి వేవేలు లంకెలు
ఘనుఁడ శ్రీవేంకటేశ గక్కునఁ గూడితి విట్టె
ననుపుసేసుక యిట్టె నవ్వవయ్య నీవు
(||pallavi||)
iddarigim̐ dĕramaṟam̐ gide kaladi
vuddaṁḍālagum̐ bĕnam̐gaguṁḍavayya nīvu
(||idda||)
sadulagum̐jalamu javvanabum̐ bŏlamu
tadi valabulagu nuttamaphalamu
padigim̐ badigā nīvu paṁtamāḍaniṁtayela
radula gaḍivoguṁḍā rāvayya nīvu
(||idda||)
sĕlulagu madibaṭṭu sittajunisebaṭṭu
balulai(vai?)naasalagum̐ bāyanimĕṭṭu
malasi iṁdugum̐gānu mārugŏna nīgela
kŏlam̐di migulanum̐ jegŏnavayya priyamu
(||idda||)
vanidalagu maṁkulu vāsula kĕllā naṁkĕlu
vĕnagamuṁdarigi vevelu laṁkĕlu
ghanum̐ḍa śhrīveṁkaḍeśha gakkunam̐ gūḍidi viṭṭĕ
nanubusesuga yiṭṭĕ navvavayya nīvu