Iddarigim boruvetti yemi soosi navvevayya

ఇద్దరికిఁ బోరువెట్టి యేమి చూచి నవ్వేవయ్య
Language

(॥పల్లవి॥)
ఇద్దరికిఁ బోరువెట్టి యేమి చూచి నవ్వేవయ్య
గుద్దులాట వెలిగాను కోపగించీ నీపె

(॥॥)
మొగము తప్పక చూచి మూతులు విరుచుకొని
జగడించి ఇట్టే పగచాటీ నీపె
పగటుఁజేతులు చాచి పైపై వేళ్ళు మడిచి
తగవులకు రమ్మంటా దట్టించీ వాపె

(॥॥)
ఆడరాని మాటలాడి అట్టే వొట్లు వెట్టి
జాడతోడ సణఁగులు చల్లీ నీపె
వాడలో సాకిరివెట్టి వనితలకెల్లాఁ జెప్పి
తోడనే నీమీఁదఁ బెట్టి తొర్లఁదిట్టీ నాపె

(॥॥)
పిరిచుట్టు చుట్టుకొని బిగువుతో నిల్లురికి
సరుస వాదులడిచి జంకించీ నీపె
యిరవై శ్రీవేంకటేశ యెడచొచ్చి నీవిద్ధరి
సరిసేసి కూడఁగాను సాదులై రీపెనాపె

(||pallavi||)
iddarigim̐ boruvĕṭṭi yemi sūsi navvevayya
guddulāḍa vĕligānu kobagiṁchī nībĕ

(||||)
mŏgamu tappaga sūsi mūdulu virusugŏni
jagaḍiṁchi iṭṭe pagasāḍī nībĕ
pagaḍum̐jedulu sāsi paibai veḽḽu maḍisi
tagavulagu rammaṁṭā daṭṭiṁchī vābĕ

(||||)
āḍarāni māḍalāḍi aṭṭe vŏṭlu vĕṭṭi
jāḍadoḍa saṇam̐gulu sallī nībĕ
vāḍalo sāgirivĕṭṭi vanidalagĕllām̐ jĕppi
toḍane nīmīm̐dam̐ bĕṭṭi tŏrlam̐diṭṭī nābĕ

(||||)
pirisuṭṭu suṭṭugŏni biguvudo nillurigi
sarusa vādulaḍisi jaṁkiṁchī nībĕ
yiravai śhrīveṁkaḍeśha yĕḍasŏchchi nīviddhari
sarisesi kūḍam̐gānu sādulai rībĕnābĕ