Iddarigim bodu yemtagemta sesevu

ఇద్దరికిఁ బోదు యెంతకెంత సేసేవు
Language

(॥పల్లవి॥)
ఇద్దరికిఁ బోదు యెంతకెంత సేసేవు
ముద్దరాల యతనితో మొగమోట వలదా

(॥ఇద్ద॥)
సరసమాడేయప్పడే చలము సాదించేవు
తెరమరఁగై తేనే తిట్టు దిట్టేవు
సరుగ నెదుటనుంటే సారెఁ గొప్పు వట్టేవు
మురిపేన, మొగనితో మొగమోట వలదా

(॥ఇద్ద॥)
పెనఁగేటి యప్పడే బెట్టిగోరు దాఁకించేవు
కనుఁగొన్నయంతలోనే గద్దించేవు
చనవు నీ కిచ్చితేనె సదమదము సేసేవు
మొనసి యీతనితోను మొగమోట వలదా

(॥ఇద్ద॥)
కెలసి నవ్వేయప్పుడే కిందుపడ వేసేవు
కలికి మోవియ్యఁగానే గంటిసేసేవు
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్ను నేలె
మొలక వయసు దాన మొగమోట వలదా

(||pallavi||)
iddarigim̐ bodu yĕṁtagĕṁta sesevu
muddarāla yadanido mŏgamoḍa valadā

(||idda||)
sarasamāḍeyappaḍe salamu sādiṁchevu
tĕramaram̐gai tene tiṭṭu diṭṭevu
saruga nĕduḍanuṁṭe sārĕm̐ gŏppu vaṭṭevu
muribena, mŏganido mŏgamoḍa valadā

(||idda||)
pĕnam̐geḍi yappaḍe bĕṭṭigoru dām̐kiṁchevu
kanum̐gŏnnayaṁtalone gaddiṁchevu
sanavu nī kichchidenĕ sadamadamu sesevu
mŏnasi yīdanidonu mŏgamoḍa valadā

(||idda||)
kĕlasi navveyappuḍe kiṁdubaḍa vesevu
kaligi moviyyam̐gāne gaṁṭisesevu
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnu nelĕ
mŏlaga vayasu dāna mŏgamoḍa valadā