Iddarigi saribamtaa limka leraadaa

ఇద్దరికి సరిపంతా లిఁక లేరాదా
Language

(॥పల్లవి॥)
ఇద్దరికి సరిపంతా లిఁక లేరాదా
తిద్దుకొని మీలో మీరే తెలుసుకోరాదా

(॥ఇద్ద॥)
కోపించి చూచినచూపు గురిసేసి యంతలోనే
పైపై నవ్వి చూచితే పంత మిచ్చుటా
రాపుగాఁ దిట్టిననోర రమ్మని పిలిచి తానె
యేపున ముచ్చటలాడు టిది పంత మిచ్చుటా

(॥ఇద్ద॥)
పలుమారు రేసులను పగ చాటినచేతుల
బలిమిఁ గొంగువట్టుటే పంత మిచ్చుటా
అలిగి లోననుండి ఆనలు వెట్టి కమ్మటి
తలుపు దెరచితేనే తానే పంత మిచ్చుటా

(॥ఇద్ద॥)
మానితి మనుచు వేరె మారుమంచాలెక్కి వొక్కఁ
పానుపుపై చేరితేనే పంత మిచ్చుటా
ఆనుక శ్రీవేంకటేశ ఆపె నీవూఁ గూడితిరి
యీనెపాన చన విచ్చు టిది పంత మిచ్చుటా

(||pallavi||)
iddarigi saribaṁtā lim̐ka lerādā
tiddugŏni mīlo mīre tĕlusugorādā

(||idda||)
kobiṁchi sūsinasūbu gurisesi yaṁtalone
paibai navvi sūside paṁta michchuḍā
rābugām̐ diṭṭinanora rammani pilisi tānĕ
yebuna muchchaḍalāḍu ṭidi paṁta michchuḍā

(||idda||)
palumāru resulanu paga sāḍinasedula
balimim̐ gŏṁguvaṭṭuḍe paṁta michchuḍā
aligi lonanuṁḍi ānalu vĕṭṭi kammaḍi
talubu dĕrasidene tāne paṁta michchuḍā

(||idda||)
mānidi manusu verĕ mārumaṁchālĕkki vŏkkam̐
pānububai seridene paṁta michchuḍā
ānuga śhrīveṁkaḍeśha ābĕ nīvūm̐ gūḍidiri
yīnĕbāna sana vichchu ṭidi paṁta michchuḍā