ఇద్దరికి మీకుఁ దగునింతలేసి
(॥పల్లవి॥)
ఇద్దరికి మీకుఁ దగునింతలేసి
బద్దులేల నెరపేవు బారెఁడేసి
(॥ఇద్ద॥)
నెలకొన్న సేఁతలు నీవేమి సేసితివొ
సెలవుల నవ్వీనాపె చేటఁడేసి
మలసి మలసి నీవు మర్మములెట్టంటితివో
కులికీని సిగ్గులెల్లా గుంపెఁడేసి
(॥ఇద్ద॥)
సందడి మీ కెటువలె సమ్మతులైనవొ కాని
కందువమాఁటలాడీని గాదెఁడేసి
మందలించి నీవెంత మరిగించితివొ నేఁడు
పొందులు చూపీనిట్టే పుట్టెఁడేసి
(॥ఇద్ద॥)
మంచముపై రతినెంత మనసు గరఁగించితివొ
వంచీఁ జూపులు నీపై వామెఁడేసి
యెంచఁగ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నించి వలపులెల్లా నిలివెఁడేసి
(||pallavi||)
iddarigi mīgum̐ daguniṁtalesi
baddulela nĕrabevu bārĕm̐ḍesi
(||idda||)
nĕlagŏnna sem̐talu nīvemi sesidivŏ
sĕlavula navvīnābĕ seḍam̐ḍesi
malasi malasi nīvu marmamulĕṭṭaṁṭidivo
kuligīni siggulĕllā guṁpĕm̐ḍesi
(||idda||)
saṁdaḍi mī kĕḍuvalĕ sammadulainavŏ kāni
kaṁduvamām̐ṭalāḍīni gādĕm̐ḍesi
maṁdaliṁchi nīvĕṁta marigiṁchidivŏ nem̐ḍu
pŏṁdulu sūbīniṭṭe puṭṭĕm̐ḍesi
(||idda||)
maṁchamubai radinĕṁta manasu garam̐giṁchidivŏ
vaṁchīm̐ jūbulu nībai vāmĕm̐ḍesi
yĕṁcham̐ga śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
niṁchi valabulĕllā nilivĕm̐ḍesi