Iddarigi meege sellu niduvamtivi

ఇద్దరికి మీకే చెల్లు నిటువంటివి
Language

(॥పల్లవి॥)
ఇద్దరికి మీకే చెల్లు నిటువంటివి
చద్ది వేఁడి సరసాలే జవళిభోగములు

(॥ఇద్ద॥)
భావము లెనసినట్టి పడఁతికి విభునకు
వేవేలు వెంగెములు వినయములే
తావుకొన్నవలపులు తారుకాణలైనచోట
కావరపు గోరొత్తులు కమ్మఁబూవుతాఁకులే

(॥ఇద్ద॥)
కనుచూపులు సోఁకిన కందువైనచుట్టాలకు
పెనఁగులాటలెన్నైనాఁ బ్రేమపు చౌలే
తనివోని తమకపు తగులాటమైతేను
ననుపు బొమ్మజంకెలు నయగారాలే

(॥ఇద్ద॥)
సెలవుల నవ్వుదేరఁ జేరి కూడినవారికి
అలయిక రతులెల్ల నలవాటులే
యెలమి శ్రీవేంకటేశ యింతి నీవు గలసితి
రలవోక మీ చేఁతలన్నియుఁ దచ్చనలే

(||pallavi||)
iddarigi mīge sĕllu niḍuvaṁṭivi
saddi vem̐ḍi sarasāle javaḽibhogamulu

(||idda||)
bhāvamu lĕnasinaṭṭi paḍam̐tigi vibhunagu
vevelu vĕṁgĕmulu vinayamule
tāvugŏnnavalabulu tārugāṇalainasoḍa
kāvarabu gorŏttulu kammam̐būvudām̐kule

(||idda||)
kanusūbulu som̐kina kaṁduvainasuṭṭālagu
pĕnam̐gulāḍalĕnnainām̐ bremabu saule
tanivoni tamagabu tagulāḍamaidenu
nanubu bŏmmajaṁkĕlu nayagārāle

(||idda||)
sĕlavula navvuderam̐ jeri kūḍinavārigi
alayiga radulĕlla nalavāḍule
yĕlami śhrīveṁkaḍeśha yiṁti nīvu galasidi
ralavoga mī sem̐talanniyum̐ dachchanale