ఇద్దరికి దైవము యెట్టు గూర్చెనో
(॥పల్లవి॥)
ఇద్దరికి దైవము యెట్టు గూర్చెనో
గద్దరితనములందె కలిగె కొసరులు
(॥ఇద్ద॥)
సొలసి సొలసి నిన్నుఁ జూచి నేనే భ్రమసితి
బలిమి నీ మనసెంత భ్రమసెనో
నలుపులు తెలుపులు నాకన్నులసాజము
తెలిసితే నలుపులుఁ దెలుపు నీ చేఁతలు
(॥ఇద్ద॥)
నలువంక నీతోడ నవ్వి నవ్వి యలసితి
అలరి నీ తనువెంత యలసెనో
మలకలు కొలుకులు మా కురులసాజము
అలరి మలకలు నీ యన్ని గుణములును
(॥ఇద్ద॥)
కావరించి నీ కాఁగిట కలసి నే వెలసితి
వేవేలై నీమోవి యంత వెలసెనో
శ్రీ వేంకటేశుఁడ మాకు సిగ్గులెల్లా సాజము
యీవల నీకు సిగ్గు లెందు వచ్చెనో
(||pallavi||)
iddarigi daivamu yĕṭṭu gūrsĕno
gaddaridanamulaṁdĕ kaligĕ kŏsarulu
(||idda||)
sŏlasi sŏlasi ninnum̐ jūsi nene bhramasidi
balimi nī manasĕṁta bhramasĕno
nalubulu tĕlubulu nāgannulasājamu
tĕliside nalubulum̐ dĕlubu nī sem̐talu
(||idda||)
naluvaṁka nīdoḍa navvi navvi yalasidi
alari nī tanuvĕṁta yalasĕno
malagalu kŏlugulu mā kurulasājamu
alari malagalu nī yanni guṇamulunu
(||idda||)
kāvariṁchi nī kām̐giḍa kalasi ne vĕlasidi
vevelai nīmovi yaṁta vĕlasĕno
śhrī veṁkaḍeśhum̐ḍa māgu siggulĕllā sājamu
yīvala nīgu siggu lĕṁdu vachchĕno