Iddarido naaliseya nimkanemtige

ఇద్దరితో నాలిసేయ నిఁకనేఁటికే
Language

(॥పల్లవి॥)
ఇద్దరితో నాలిసేయ నిఁకనేఁటికే
బుద్దులెల్ల నీ వక్కునఁ బోసి చూపరాదా

(॥ఇద్ద॥)
చనవున నాపె నిన్ను సాకిరు లడుగఁ గాను
తనువు లోపలిమాట దాఁతురా
సునిసి నామొగమేమి చూచి నీవు లోఁగేవు
మనసునఁ గలయట్టే మాకుఁ జెప్పరాదా

(॥ఇద్ద॥)
నట్టనడుమ నీలావు నమ్మి యాపె వుండఁగాను
పట్టిపెనఁగే పనికి పరాకౌదురా
యెట్టయెదుటను మాకు నింతయేల వెఱచేవు
బెట్టి నీవు మాతోనుఁ బెనఁగఁగరాదా

(॥ఇద్ద॥)
మోసదీర ఆపె నేఁడు మొక్కులు మొక్కగాను
యీసులు రేసులు మరి నిఁకనెంతరా
సేసవెట్టి కూడితివి శ్రీవేంకటేశ్వర నన్ను
ఆసపడ్డవారిని మమ్మాదరించరాదా

(||pallavi||)
iddarido nāliseya nim̐kanem̐ṭige
buddulĕlla nī vakkunam̐ bosi sūbarādā

(||idda||)
sanavuna nābĕ ninnu sāgiru laḍugam̐ gānu
tanuvu lobalimāḍa dām̐turā
sunisi nāmŏgamemi sūsi nīvu lom̐gevu
manasunam̐ galayaṭṭe māgum̐ jĕpparādā

(||idda||)
naṭṭanaḍuma nīlāvu nammi yābĕ vuṁḍam̐gānu
paṭṭibĕnam̐ge panigi parāgaudurā
yĕṭṭayĕduḍanu māgu niṁtayela vĕṟasevu
bĕṭṭi nīvu mādonum̐ bĕnam̐gam̐garādā

(||idda||)
mosadīra ābĕ nem̐ḍu mŏkkulu mŏkkagānu
yīsulu resulu mari nim̐kanĕṁtarā
sesavĕṭṭi kūḍidivi śhrīveṁkaḍeśhvara nannu
āsabaḍḍavārini mammādariṁcharādā