(॥పల్లవి॥)
ఇద్దరి తమకము నిటువలెనే
పొద్దున నేమని బొంకుదమయ్యా
(॥ఇద్ద॥)
లలి నాకధరము లంచమియ్యఁగా
పలు సోఁకులయి పరగెనవే
పిలువఁగరాఁగా బెరసి నిందపడె
పొలఁతికి నేమని బొంకుదమయ్యా
(॥ఇద్ద॥)
అడుగుకొనుచు నిన్నంటి పెనఁగఁగా
తడయక నఖములు తాఁకె నవే
తొడుకొని రాఁగా దూఱు మీఁదఁబడె
పొడవుగ నేమని బొంకుదమయ్యా
(॥ఇద్ద॥)
పెక్కులు చెవిలోఁ బ్రియములు చెప్పఁగ
ముక్కువ జవ్వాది మోచె నిదే
యిక్కడ శ్రీవేంకటేశుఁడ సడివడె
పుక్కటి నేమని బొంకుదమయ్యా
(||pallavi||)
iddari tamagamu niḍuvalĕne
pŏdduna nemani bŏṁkudamayyā
(||idda||)
lali nāgadharamu laṁchamiyyam̐gā
palu som̐kulayi paragĕnave
piluvam̐garām̐gā bĕrasi niṁdabaḍĕ
pŏlam̐tigi nemani bŏṁkudamayyā
(||idda||)
aḍugugŏnusu ninnaṁṭi pĕnam̐gam̐gā
taḍayaga nakhamulu tām̐kĕ nave
tŏḍugŏni rām̐gā dūṟu mīm̐dam̐baḍĕ
pŏḍavuga nemani bŏṁkudamayyā
(||idda||)
pĕkkulu sĕvilom̐ briyamulu sĕppam̐ga
mukkuva javvādi mosĕ nide
yikkaḍa śhrīveṁkaḍeśhum̐ḍa saḍivaḍĕ
pukkaḍi nemani bŏṁkudamayyā