ఇద్దరి చుట్టిరికేలు యెంచి యెంచి పోలుచరే
(॥పల్లవి॥)
ఇద్దరి చుట్టిరికేలు యెంచి యెంచి పోలుచరే
సుద్దులనే మోహము సూటిపడుఁ గాని
(॥ఇద్దరి॥)
సతివదనముపూర్ణ చంద్రునిఁ బోలుచరే
అతనికన్నులఁ గలువ లలరుఁ గాని
మితిలేని తురుము తుమ్మెదలఁ బోలుచరే
తతిఁ బతిమోవిఁదేనె దైలువారుఁ గాని
(॥ఇద్దరి॥)
మించుఁజన్ను లీకెవి తామెరలఁ బోలుచరే
ముంచివిభుచూపుఁదేంట్లు మూఁగుఁ గాని
పెంచి యిసుక దిబ్బగాఁ బిఱుఁదు వోలుచరే
అంచల నీతనిమనోహంస వాలుఁ గాని
(॥ఇద్దరి॥)
తక్కక యాకెపాదాలుతాఁబేళ్లఁ బోలుచరే
ని క్కీతని చెమటేరు నిండుఁగాని
అక్కున నలమేల్మంగ యట్టే శ్రీవేంకటేశుఁడు
చక్కఁదనాలు వోల్చరే సమములౌఁ గాని
(||pallavi||)
iddari suṭṭirigelu yĕṁchi yĕṁchi polusare
suddulane mohamu sūḍibaḍum̐ gāni
(||iddari||)
sadivadanamubūrṇa saṁdrunim̐ bolusare
adanigannulam̐ galuva lalarum̐ gāni
midileni turumu tummĕdalam̐ bolusare
tadim̐ badimovim̐denĕ dailuvārum̐ gāni
(||iddari||)
miṁchum̐jannu līgĕvi tāmĕralam̐ bolusare
muṁchivibhusūbum̐deṁṭlu mūm̐gum̐ gāni
pĕṁchi yisuga dibbagām̐ biṟum̐du volusare
aṁchala nīdanimanohaṁsa vālum̐ gāni
(||iddari||)
takkaga yāgĕbādāludām̐beḽlam̐ bolusare
ni kkīdani sĕmaḍeru niṁḍum̐gāni
akkuna nalamelmaṁga yaṭṭe śhrīveṁkaḍeśhum̐ḍu
sakkam̐danālu volsare samamulaum̐ gāni