Iddari semtaloo sare imkaa nemaneve

ఇద్దరి చేఁతలూ సరే ఇంకా నేమనేవే
Language

(॥పల్లవి॥)
ఇద్దరి చేఁతలూ సరే ఇంకా నేమనేవే
పెద్దరికమే కలితే పెనఁగవే నీవు

(॥ఇద్ద॥)
వాలుక రెప్పలు నీవు వంచివంచి చూడఁగా
కాలుదొక్కె నందుకేపో ఘనుఁడితఁడు
వేలుఁగొప్పుతోడ నీవు వెంగెము లాడఁగాను
కోలుముందుగా నిన్ను గోర గీర నతఁడు

(॥ఇద్ద॥)
పలుమారు నీకునీవే పంతములు నెరపఁగా
చలపట్టి పయ్యదలో చన్నులంటెను
నలువంకఁ జెలరేఁగినవ్వు నీవు నవ్వఁగాను
తలకొనినీలోనితమిరేఁచె నతఁడు

(॥ఇద్ద॥)
మంతనానఁ జేయిచాఁచి మర్మములుచెనకఁగా
యింతోనె నీమోవి యెంగిలిసేసె
కాంతవు నీవుచెలరేఁగి కపపురవిడెమియ్యఁగా
వింతగానిన్నుఁగూడె శ్రీవేంకటేశుఁ డతఁడు

(||pallavi||)
iddari sem̐talū sare iṁkā nemaneve
pĕddarigame kalide pĕnam̐gave nīvu

(||idda||)
vāluga rĕppalu nīvu vaṁchivaṁchi sūḍam̐gā
kāludŏkkĕ naṁdugebo ghanum̐ḍidam̐ḍu
velum̐gŏppudoḍa nīvu vĕṁgĕmu lāḍam̐gānu
kolumuṁdugā ninnu gora gīra nadam̐ḍu

(||idda||)
palumāru nīgunīve paṁtamulu nĕrabam̐gā
salabaṭṭi payyadalo sannulaṁṭĕnu
naluvaṁkam̐ jĕlarem̐ginavvu nīvu navvam̐gānu
talagŏninīlonidamirem̐sĕ nadam̐ḍu

(||idda||)
maṁtanānam̐ jeyisām̐si marmamulusĕnagam̐gā
yiṁtonĕ nīmovi yĕṁgilisesĕ
kāṁtavu nīvusĕlarem̐gi kababuraviḍĕmiyyam̐gā
viṁtagāninnum̐gūḍĕ śhrīveṁkaḍeśhum̐ ḍadam̐ḍu