Iddari saridalu yimdaroom jooseru

ఇద్దరి సరితలు యిందరూఁ జూచేరు
Language

(॥పల్లవి॥)
ఇద్దరి సరితలు యిందరూఁ జూచేరు
ముద్దులవెూముకు మొక్కేము నేము

(॥ఇద్ద॥)
సళుపులమాటలు సతి నిన్నాడఁగ
కలకల నవ్వేవు కాంతుఁడవు
పెలుచుఁ దమకమునఁ బెనగఁగఁ బెనగఁగ
చలమునఁ జేతులు చాఁచేవు నీవు

(॥ఇద్ద॥)
మగుడి యాపె బొమ్మల జంకించఁగ
సొగయుచు మొగమే చూచేవు
బిగియుచు నందుకు పెదవుల గొణఁగఁగ
వెగటు లేక యిటు వేడుకొనేవు

(॥ఇద్ద॥)
పంతముతోఁ జెలి పవళించఁగా
ఇంతినిఁ గాఁగిట నెనసేవు
కొంత గొసరఁగాఁ గూడితివిదెవో
యింతటి శ్రీవేంకటేశుఁడవు

(||pallavi||)
iddari saridalu yiṁdarūm̐ jūseru
muddulavĕూmugu mŏkkemu nemu

(||idda||)
saḽubulamāḍalu sadi ninnāḍam̐ga
kalagala navvevu kāṁtum̐ḍavu
pĕlusum̐ damagamunam̐ bĕnagam̐gam̐ bĕnagam̐ga
salamunam̐ jedulu sām̐sevu nīvu

(||idda||)
maguḍi yābĕ bŏmmala jaṁkiṁcham̐ga
sŏgayusu mŏgame sūsevu
bigiyusu naṁdugu pĕdavula gŏṇam̐gam̐ga
vĕgaḍu lega yiḍu veḍugŏnevu

(||idda||)
paṁtamudom̐ jĕli pavaḽiṁcham̐gā
iṁtinim̐ gām̐giḍa nĕnasevu
kŏṁta gŏsaram̐gām̐ gūḍidividĕvo
yiṁtaḍi śhrīveṁkaḍeśhum̐ḍavu