ఇద్దరి పొందులు నేఁడు ఇందులోనె కానవచ్చె
(॥పల్లవి॥)
ఇద్దరి పొందులు నేఁడు ఇందులోనె కానవచ్చె
కద్దులే మీలోని తారుకాణ లెటువంటివో
(॥ఇద్ద॥)
చెలరేఁగి చెలరేఁగి చెలి నీతో మాటలాడీ
కులుకుఁ జూపుల నెట్టుకొని చూచీని
వలపులు చల్లుకొంటా వాడికనవ్వులు నవ్వీ
అలర నీపెకు నెంత ఆసలు వెట్టితివో
(॥ఇద్ద॥)
సారెసారెకును నిన్ను చనవునఁ గొసరీని
కూరిమితోఁ గొలువు దాకొని సేసీని
నేరుపులు వచరించి నిండు సరసము లాడీ
యారీతి సన్నలు నీకూ నీపెకును నెట్టివో
(॥ఇద్ద॥)
చెనకి చెనకి నీకు సేవలెల్లాఁ జేసీని
గొనకొని వద్ద నెలకొని వుండీని
యెనసె శ్రీవేంకటేశ యాకె యలమేలుమంగ
వొనరిన మీతొంటివొడఁబాటు లెట్టివో
(||pallavi||)
iddari pŏṁdulu nem̐ḍu iṁdulonĕ kānavachchĕ
kaddule mīloni tārugāṇa lĕḍuvaṁṭivo
(||idda||)
sĕlarem̐gi sĕlarem̐gi sĕli nīdo māḍalāḍī
kulugum̐ jūbula nĕṭṭugŏni sūsīni
valabulu sallugŏṁṭā vāḍiganavvulu navvī
alara nībĕgu nĕṁta āsalu vĕṭṭidivo
(||idda||)
sārĕsārĕgunu ninnu sanavunam̐ gŏsarīni
kūrimidom̐ gŏluvu dāgŏni sesīni
nerubulu vasariṁchi niṁḍu sarasamu lāḍī
yārīdi sannalu nīgū nībĕgunu nĕṭṭivo
(||idda||)
sĕnagi sĕnagi nīgu sevalĕllām̐ jesīni
gŏnagŏni vadda nĕlagŏni vuṁḍīni
yĕnasĕ śhrīveṁkaḍeśha yāgĕ yalamelumaṁga
vŏnarina mīdŏṁṭivŏḍam̐bāḍu lĕṭṭivo