ఇద్దరి నేరుపులును యిందులోనె కానవచ్చె
(॥పల్లవి॥)
ఇద్దరి నేరుపులును యిందులోనె కానవచ్చె
చద్ది వేఁడివలపులు సతమాయ మీకును
(॥ఇద్ద॥)
కన్నులనె మాఁటలాడీఁ గలికి నీతో
యిన్నిటా జాణవు నీవు యెఱఁగరాదా
చన్నులనే కానుకిచ్చీ సారెసారెకు
చెన్ను మిగులఁగ నీవు చేయి చాఁచరాదా
(॥ఇద్ద॥)
మోవినే విందులువెట్టీ ముద్దరాలు
వావాతఁ జవిగొని వలవరాదా
చేవల్లఁ గోలుపుసేసి సేస చల్లీనౌ
సేవగొని నీవందుకు శిరసొగ్గరాదా
(॥ఇద్ద॥)
చెక్కులనే నీడ చూపీఁ జెలియ నీకు
చక్కఁదనాలు చూచుక చనవీరాదా
మొక్కీ శ్రీవేంకటేశ మునివేళ్ళనే
మక్కువఁ గూడితివిట్టె మన్నించరాదా
(||pallavi||)
iddari nerubulunu yiṁdulonĕ kānavachchĕ
saddi vem̐ḍivalabulu sadamāya mīgunu
(||idda||)
kannulanĕ mām̐ṭalāḍīm̐ galigi nīdo
yinniḍā jāṇavu nīvu yĕṟam̐garādā
sannulane kānugichchī sārĕsārĕgu
sĕnnu migulam̐ga nīvu seyi sām̐sarādā
(||idda||)
movine viṁduluvĕṭṭī muddarālu
vāvādam̐ javigŏni valavarādā
sevallam̐ golubusesi sesa sallīnau
sevagŏni nīvaṁdugu śhirasŏggarādā
(||idda||)
sĕkkulane nīḍa sūbīm̐ jĕliya nīgu
sakkam̐danālu sūsuga sanavīrādā
mŏkkī śhrīveṁkaḍeśha muniveḽḽane
makkuvam̐ gūḍidiviṭṭĕ manniṁcharādā