Iddari nerubulagu nidi vela

ఇద్దరి నేరుపులకు నిది వేళ
Language

(॥పల్లవి॥)
ఇద్దరి నేరుపులకు నిది వేళ
సుద్దులెల్లాఁ జెప్పి పతిఁ జొక్కించవే

(॥ఇద్ద॥)
చనవుగలుగువారు చలము సాదింతురా
ననుపులనే వలపు నాఁటింతురు
మనససెరిఁగుండియును మగని నింత సేతురా
కినుక నవ్వుసేసుక కేలెత్తి మొక్కవే

(॥ఇద్ద॥)
తగులమిగులవారు తప్ప పట్టుదురా
మొగమోటనే కళలు మెలపింతురు
తగవరివిబునిబంతములాడి దూరుదురా
బిగువుగుట్టు సేసుక ప్రియములు చెప్పవే

(॥ఇద్ద॥)
అసలుగలుగువారు ఆరడిఁబెట్టుదురా
సేసవెట్టి చేతిలోనె చిక్కింతురు
బాసిచ్చిన శ్రీవేంకటపతిఁ గూడి పంగింతురా
యీసులువాసులు సేసు కిచ్చకములాడవే

(||pallavi||)
iddari nerubulagu nidi veḽa
suddulĕllām̐ jĕppi padim̐ jŏkkiṁchave

(||idda||)
sanavugaluguvāru salamu sādiṁturā
nanubulane valabu nām̐ṭiṁturu
manasasĕrim̐guṁḍiyunu magani niṁta sedurā
kinuga navvusesuga kelĕtti mŏkkave

(||idda||)
tagulamigulavāru tappa paṭṭudurā
mŏgamoḍane kaḽalu mĕlabiṁturu
tagavarivibunibaṁtamulāḍi dūrudurā
biguvuguṭṭu sesuga priyamulu sĕppave

(||idda||)
asalugaluguvāru āraḍim̐bĕṭṭudurā
sesavĕṭṭi sedilonĕ sikkiṁturu
bāsichchina śhrīveṁkaḍabadim̐ gūḍi paṁgiṁturā
yīsuluvāsulu sesu kichchagamulāḍave