Iddari nadimi baasa levvarim daamkuno yamtaa

ఇద్దరి నడిమి బాస లెవ్వరిఁ దాఁకునో యంటా
Language

(॥పల్లవి॥)
ఇద్దరి నడిమి బాస లెవ్వరిఁ దాఁకునో యంటా
అద్ది చెక్కు చే యిడితి నందుకే వోయమ్మ

(॥ఇద్ద॥)
కంటే నొకమాటయుఁ గానకుంటే నొకమాటా-
నింటివాఁడై యాడేవాని కేది వాటో
నంటున నే నెంతైన నాకుఁగా పగవ నీ-
గొంటు చందమునకే గొదిలే నమ్మా

(॥ఇద్ద॥)
మంచముపై నొకకాలు మరినేల నొకకాలు
యెంచుకొంటా మోపేవాని కేది వాటో
అంచెల నావిరహాన కందుకేమీ ననఁ గాని
కొంచించేను వానిలోని కుచ్చితాన కమ్మా

(॥ఇద్ద॥)
కనుచూపులనే కొంత కాఁగిటి లోపలఁ గొంత
యెనసి చొక్కేవాని కేది వాటో
అనుఁగు శ్రీవేంకటేశుఁ డంతలోనే నన్నుఁ గూడె
పనివడి యిందుకే కా బ్రమసితి నమ్మా

(||pallavi||)
iddari naḍimi bāsa lĕvvarim̐ dām̐kuno yaṁṭā
addi sĕkku se yiḍidi naṁduge voyamma

(||idda||)
kaṁṭe nŏgamāḍayum̐ gānaguṁṭe nŏgamāḍā-
niṁṭivām̐ḍai yāḍevāni kedi vāḍo
naṁṭuna ne nĕṁtaina nāgum̐gā pagava nī-
gŏṁṭu saṁdamunage gŏdile nammā

(||idda||)
maṁchamubai nŏgagālu marinela nŏgagālu
yĕṁchugŏṁṭā mobevāni kedi vāḍo
aṁchĕla nāvirahāna kaṁdugemī nanam̐ gāni
kŏṁchiṁchenu vāniloni kuchchidāna kammā

(||idda||)
kanusūbulane kŏṁta kām̐giḍi lobalam̐ gŏṁta
yĕnasi sŏkkevāni kedi vāḍo
anum̐gu śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalone nannum̐ gūḍĕ
panivaḍi yiṁduge kā bramasidi nammā