ఇద్దరి మోహరసము లేరులై పారఁజొచ్చె
(॥పల్లవి॥)
ఇద్దరి మోహరసము లేరులై పారఁజొచ్చె
నిద్దురవోకున్నవాఁడు నీ రమణుఁడు
(॥ఇద్ద॥)
సెలవి నవ్విననవ్వు చెక్కులవెంటఁ గారఁగాను
చెలి యేల పెట్టితివే చెక్కునఁ జేయి
జలజలఁ జెమటలు చెక్కుల వెంటఁ గారఁగా
నిలిచి చూచీ నదె నీరమణుఁడు
(॥ఇద్ద॥)
మురిపెపుజవ్వనము మొనచన్నులఁ గారఁగా
శిరసేల వంచేవేచెల్లఁబో నీవు
నిరతపుటాసలు నిలువెల్లాఁ గారఁగాను
నెరపీని సరసాలు నీరమణుఁడు
(॥ఇద్ద॥)
పిలుపు నీమాటలలో ప్రియమెల్లాఁగారఁగాను
అలమేలుమంగవుయేమనేవేనీవు
ఇల శ్రీవేంకటేశుఁడు ఇదె ని న్నురము మీఁద
నిలిపె ముద్దుగారఁగా నీరమణుఁడు
(||pallavi||)
iddari moharasamu lerulai pāram̐jŏchchĕ
nidduravogunnavām̐ḍu nī ramaṇum̐ḍu
(||idda||)
sĕlavi navvinanavvu sĕkkulavĕṁṭam̐ gāram̐gānu
sĕli yela pĕṭṭidive sĕkkunam̐ jeyi
jalajalam̐ jĕmaḍalu sĕkkula vĕṁṭam̐ gāram̐gā
nilisi sūsī nadĕ nīramaṇum̐ḍu
(||idda||)
muribĕbujavvanamu mŏnasannulam̐ gāram̐gā
śhirasela vaṁchevesĕllam̐bo nīvu
niradabuḍāsalu niluvĕllām̐ gāram̐gānu
nĕrabīni sarasālu nīramaṇum̐ḍu
(||idda||)
pilubu nīmāḍalalo priyamĕllām̐gāram̐gānu
alamelumaṁgavuyemanevenīvu
ila śhrīveṁkaḍeśhum̐ḍu idĕ ni nnuramu mīm̐da
nilibĕ muddugāram̐gā nīramaṇum̐ḍu