Iddari meegoodamulu yinnidaanum dagunu

ఇద్దరి మీకూటములు యిన్నిటానుఁ దగును
Language

(॥పల్లవి॥)
ఇద్దరి మీకూటములు యిన్నిటానుఁ దగును
నిద్దపు శ్రీవేంకటేశ నేఁడుగా నాభాగ్యము

(॥ఇద్ద॥)
పాలదొంగవై గొల్లపడుఁచువైతివంటా
పాలజలనిధిలోనఁ బడఁతి వుట్టె
నీలవేణి పుండరీకనేత్రుఁడవు నీవంటా
తాలిమి రెండుచేతులాఁ దామెరలు వట్టెను

(॥ఇద్ద॥)
బంగారుపచ్చడము పడఁతి నీప్రియమంటా
బంగారువంటిమేనఁ బరగె నిదె
నింగిమోచేచదువులు నీవల్లనే పుట్టెనంటా
చెంగటఁ జదివినట్టిచిలుకఁ జేఁబట్టెను

(॥ఇద్ద॥)
మెండగుశ్రీవేంకటాద్రిమీఁద నీవెక్కితివంటా
కొండవంటి నీయురము కొమ్మయెక్కెను
పండునిమ్మపంటివన్నెపాలిండ్లంటుదువంటా
పండినమాధీఘలము పడఁతి చేఁబట్టెను

(||pallavi||)
iddari mīgūḍamulu yinniḍānum̐ dagunu
niddabu śhrīveṁkaḍeśha nem̐ḍugā nābhāgyamu

(||idda||)
pāladŏṁgavai gŏllabaḍum̐suvaidivaṁṭā
pālajalanidhilonam̐ baḍam̐ti vuṭṭĕ
nīlaveṇi puṁḍarīganetrum̐ḍavu nīvaṁṭā
tālimi rĕṁḍusedulām̐ dāmĕralu vaṭṭĕnu

(||idda||)
baṁgārubachchaḍamu paḍam̐ti nīpriyamaṁṭā
baṁgāruvaṁṭimenam̐ baragĕ nidĕ
niṁgimosesaduvulu nīvallane puṭṭĕnaṁṭā
sĕṁgaḍam̐ jadivinaṭṭisilugam̐ jem̐baṭṭĕnu

(||idda||)
mĕṁḍaguśhrīveṁkaḍādrimīm̐da nīvĕkkidivaṁṭā
kŏṁḍavaṁṭi nīyuramu kŏmmayĕkkĕnu
paṁḍunimmabaṁṭivannĕbāliṁḍlaṁṭuduvaṁṭā
paṁḍinamādhīghalamu paḍam̐ti sem̐baṭṭĕnu