ఇద్దరి మీతలపోఁత లెఱఁగఁగాక
(॥పల్లవి॥)
ఇద్దరి మీతలపోఁత లెఱఁగఁగాక
కొద్దిమీరితే నగవే కోటి కొండగాదా
(॥ఇద్ద॥)
వాడికెవిభునితోడ వాదైతే నెఱఁగఁగాక
చూడనేరిచితే చూపే సూడిదెగాదా
పాడిపంతాలకు నెగ్గుపట్టితే నెఱఁగఁగాక
ఆడనేరిచితే మాట అమృతము గాదా
(॥ఇద్ద॥)
సవతిపో రితనిపైఁ జల్లితే నెఱఁగఁగాక
చవిగొంటే వలపులే చక్కెర గాదా
తివిరి చలములే సాదించితే నెఱఁగఁగాక
వివేకించితే మనసే వింతసొమ్ముగాదా
(॥ఇద్ద॥)
మతకపుసిగ్గులు నేమరితే నెఱఁగఁగాక
రతిసేసితేఁ గాఁగిలే రాజ్యము గాదా
తతి నలమేల్మంగవు దక్కె శ్రీవేంకటేశుఁడు
సతమైనచనవులే సంపదలుగావా
(||pallavi||)
iddari mīdalabom̐ta lĕṟam̐gam̐gāga
kŏddimīride nagave koḍi kŏṁḍagādā
(||idda||)
vāḍigĕvibhunidoḍa vādaide nĕṟam̐gam̐gāga
sūḍaneriside sūbe sūḍidĕgādā
pāḍibaṁtālagu nĕggubaṭṭide nĕṟam̐gam̐gāga
āḍaneriside māḍa amṛtamu gādā
(||idda||)
savadibo ridanibaim̐ jallide nĕṟam̐gam̐gāga
savigŏṁṭe valabule sakkĕra gādā
tiviri salamule sādiṁchide nĕṟam̐gam̐gāga
vivegiṁchide manase viṁtasŏmmugādā
(||idda||)
madagabusiggulu nemaride nĕṟam̐gam̐gāga
radisesidem̐ gām̐gile rājyamu gādā
tadi nalamelmaṁgavu dakkĕ śhrīveṁkaḍeśhum̐ḍu
sadamainasanavule saṁpadalugāvā