ఇద్దరి మీ సరసము లేమని చెప్పఁగవచ్చు
(॥పల్లవి॥)
ఇద్దరి మీ సరసము లేమని చెప్పఁగవచ్చు
చద్దికి వేఁడికి సంతోషములెన్నోకాని
(॥ఇద్ద॥)
ఇదె చనవు మనువు లిన్ని నీతోఁ జెప్పీని
సుదతి నీకెటువంటి చుట్టమోకాని
గుదిగొని సారెసారెఁ గొలువులు సేసీని
పొదిగి నీయెడ కెంత పొందోకాని
(॥ఇద్ద॥)
మునుకొని సన్నలు నీముందరనే సేసీని
యెనసిన పను లవి యెట్టివోకాని
పెనఁగుచు వేఁడుకొని ప్రియములు చెప్పీని
వొనరిన దెటువంటి వొడఁ బాటోకాని
(॥ఇద్ద॥)
నగుతానే సొలయుచు నయములు చూపీని
మొగమోట మెటువంటి ముచ్చటోకాని
ఆ(అ?) గపడి శ్రీవేంకటాధిప నిన్నుఁ బెండ్లాడె
మగువకు నీకు నెంత మచ్చికోకాని
(||pallavi||)
iddari mī sarasamu lemani sĕppam̐gavachchu
saddigi vem̐ḍigi saṁtoṣhamulĕnnogāni
(||idda||)
idĕ sanavu manuvu linni nīdom̐ jĕppīni
sudadi nīgĕḍuvaṁṭi suṭṭamogāni
gudigŏni sārĕsārĕm̐ gŏluvulu sesīni
pŏdigi nīyĕḍa kĕṁta pŏṁdogāni
(||idda||)
munugŏni sannalu nīmuṁdarane sesīni
yĕnasina panu lavi yĕṭṭivogāni
pĕnam̐gusu vem̐ḍugŏni priyamulu sĕppīni
vŏnarina dĕḍuvaṁṭi vŏḍam̐ bāḍogāni
(||idda||)
nagudāne sŏlayusu nayamulu sūbīni
mŏgamoḍa mĕḍuvaṁṭi muchchaḍogāni
ā(a?) gabaḍi śhrīveṁkaḍādhiba ninnum̐ bĕṁḍlāḍĕ
maguvagu nīgu nĕṁta machchigogāni