ఇద్దరి మీ జగడాలు యింకమాకా పనిగాదు
(॥పల్లవి॥)
ఇద్దరి మీ జగడాలు యింకమాకా పనిగాదు
తిద్దలేము నిను నాపె తిట్టకుండేనా
(॥ఇద్దరి॥)
పెట్టిరాని యానలెల్లాఁ బెట్టుకొని వచ్చితిని
యిట్టె కలసెనని యింతి తోడను
చుట్టి చుట్టి చెలులతో జూజమీద నాడేవు
రట్టుసేయ నీడ కాపె ఇట్టె రాకుండేనా
(॥ఇద్దరి॥)
చెప్పరాని యాకతాలు చెప్పితి వంతటిలోన
యిప్పుడువచ్చెనని యింతి తోడను
అప్పటి వసంతమాడే వతివలతోడ నీడ
చొప్పు లాపె మేడలెక్కి చూడకుండేనా
(॥ఇద్దరి॥)
అక్కరఁ గాఁపురమెల్ల అండఁబెట్టి వచ్చితివి
యిక్కడనే వుండెనని యింతి తోడను
యిక్కువ శ్రీవేంకటేశ యేమి దలఁచోయీపెను
మిక్కుటమై కూడితివి మెచ్చకుండేనా
(||pallavi||)
iddari mī jagaḍālu yiṁkamāgā panigādu
tiddalemu ninu nābĕ tiṭṭaguṁḍenā
(||iddari||)
pĕṭṭirāni yānalĕllām̐ bĕṭṭugŏni vachchidini
yiṭṭĕ kalasĕnani yiṁti toḍanu
suṭṭi suṭṭi sĕlulado jūjamīda nāḍevu
raṭṭuseya nīḍa kābĕ iṭṭĕ rāguṁḍenā
(||iddari||)
sĕpparāni yāgadālu sĕppidi vaṁtaḍilona
yippuḍuvachchĕnani yiṁti toḍanu
appaḍi vasaṁtamāḍe vadivaladoḍa nīḍa
sŏppu lābĕ meḍalĕkki sūḍaguṁḍenā
(||iddari||)
akkaram̐ gām̐puramĕlla aṁḍam̐bĕṭṭi vachchidivi
yikkaḍane vuṁḍĕnani yiṁti toḍanu
yikkuva śhrīveṁkaḍeśha yemi dalam̐soyībĕnu
mikkuḍamai kūḍidivi mĕchchaguṁḍenā